సాక్షి, అమరావతి: సంక్రాంతి కానుక పేరుతో భారీగా జనాన్ని తరలించారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఘటన జరగ్గానే ఎల్లో మీడియా ప్లేట్ ఫిరాయించిందని.. ఘటనతో చంద్రబాబుకు సంబంధం లేదంటూ ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
‘‘తప్పును ఎన్‌ఆర్‌ఐ సంస్థపై నెట్టేసి చంద్రబాబుకు తప్పు అంటకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమం పేరుతోనే టీడీపీ నేతలే పర్మిషన్ తీసుకున్నారు. మనుషుల ప్రాణాలు పోయిన తర్వాత మాట మారుస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.
‘‘స్వచ్ఛంద సంస్థల ముసుగులో తప్పుడు రాజకీయం చేస్తున్నారు. 10 వేల మందికి టోకెన్లు ఇచ్చి సభకు తీసుకువచ్చారు.2014 నుంచి చంద్రబాబుకు డ్రోన్ జబ్బు వదల్లేదు.ఇరుకు సందుల్లోకి జనాన్ని తరలించి ప్రాణాలు తీస్తున్నారు. కొడుకుపై చంద్రబాబుకు నమ్మకం లేదు. దత్తుపుత్రుడు బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా వైఎస్ జగన్‌ను అంగుళం కూడా కదపలేరు’’ అని పేర్ని నాని అన్నారు.
చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు..
Comments
Please login to add a commentAdd a comment