దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. కూటమి నేతలకు పేర్ని నాని వార్నింగ్‌ | YSRCP Perni Nani Mass Warning To TDP And Janasena Leaders | Sakshi
Sakshi News home page

ప్రజాబలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్‌కు తెలుసు: పేర్ని నాని

Published Fri, Oct 4 2024 6:43 PM | Last Updated on Fri, Oct 4 2024 6:48 PM

 YSRCP Perni Nani Mass Warning To TDP And Janasena Leaders

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి సర్కార్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది.. మేము తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని హెచ్చరించారు.

మాజీ మాంత్రి పేర్ని నాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు ప్రజాబలం ఎక్కువ. జన బలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్‌కి బాగా తెలుసు. ప్రజలను మోసం చేయడానికి వైఎస్‌ జగన్‌ ఎర్ర పంచ కట్టలేదు. వైఎస్‌ జగన్‌ సింగిల్‌గా వచ్చి గెలిస్తే.. చంద్రబాబు పొత్తుతో వచ్చాడు. కూటమి సర్కార్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది. మేము తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు.

అలాగే, వైఎస్‌ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు.. కానీ మోసపు మాటలు మాత్రం లేవు. పవన్‌ తనకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది, మతం ఉందని డ్రామాలాడుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఏమైనా శాశ్వతంగా ఉందా?. 2019లో వైఎస్‌ జగన్‌ను 151 సీట్లతో అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. ఇప్పుడు 2029లో కూడా 175 సీట్లతో కార్యకర్తలే వైఎస్సార్‌సీపీని తిరిగి అధికారంలోకి తెస్తారు అంటూ వ్యాఖ్యలు చేశారు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement