
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనుండటంతో ఓర్వలేకే టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే... నీరు, రైతులు, పంటలు, సేద్యం గురించి తెలియదంటూ మంత్రులు పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ తానే తెచ్చానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమా పెద్ద బ్రోకర్ అని దుయ్యబట్టారు. ఇరిగేషన్‌పై తెలంగాణలో ఒక మాదిరిగా, ఆంధ్రాలో మరోలా టీడీపీ మాట్లాడుతోందని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైఎస్ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు, లోకేష్‌కు మధ్య మంత్రి దేవినేని ఉమా బ్రోకర్‌గా పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
పిల్లల్ని అడిగినా చంద్రబాబు 420 అని చెబుతారు..
ఆఖరికి అర్ధరాత్రి మంత్రి పదవి తెచ్చుకున్న బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పే మంత్రి జవహర్ కూడా జగన్ పాదయాత్ర పేరు 420 పెట్టి సినిమా తీయమని చెబుతుండడాన్ని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో 420 ఎవరో పిల్లల్ని అడిగినా ఖచ్చింగా చంద్రబాబు–420 అని చెబుతారని ఎద్దేవా చేశారు. రాంగోపాల్‌వర్మ తీసే సినిమాతో చంద్రబాబుకు, ఆయన మంత్రులకు భయం పట్టుకుందని తెలిపారు. ఎన్టీఆర్ చరిత్ర సినిమాలో విలన్‌గా 420 చంద్రబాబుని పెట్టి తీయాలని, అప్పుడే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు.
ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథులేరీ..?
కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథుడే లేడని ఆవేదన చెందారు. రాష్ట్రంలో 10 రోజుల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవడానికి కారణమైన మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు రైట్ హ్యాండ్‌గా పక్కనే కూర్చొబెట్టుకోవడంపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment