
చంద్రబాబుకు బదులు లోకేష్ పాలన..
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలంతా వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారని దేవినేని నెహ్రు వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరుడంటూ అసెంబ్లీలో పదేపదే మాట్లాడటం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని దేవినేని నెహ్రు అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబుకు బదులుగా ఆయన కొడుకు లోకేష్ పాలిస్తున్నాడని ఆయన విమర్శించారు.