బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ... | Devineni nehru takes on chandrababu naidu | Sakshi

బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ...

Published Wed, Jun 17 2015 12:05 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ... - Sakshi

బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ...

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తత్వం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రు ఆరోపించారు.

విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తత్వం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రు ఆరోపించారు. బుధవారం విజయవాడలో దేవినేని నెహ్రు మాట్లాడారు. రూ. 50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేలను ఏవిధంగా కొనాలనేదే భావితరాలకు చంద్రబాబు నేర్పుతున్నారని విమర్శించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబుపై దేవినేని నెహ్రు మండిపడ్డారు.

చీమునెత్తురు ఉంటే టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టాలని ఆయన ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులను డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్కు నోటిసులిచ్చి అరెస్ట్ చేయాలన్నారు. సీబీఐ విచారణతో కేసీఆర్ దొంగ అని నిరూపించి... హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలను తలెత్తుకునేలా చేయాలని చంద్రబాబుకు దేవినేని నేహ్రు సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని దేవినేని నెహ్రు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement