టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి: దేవినేని నెహ్రు | Congress leader Devineni Nehru fires on TDP govt | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి: దేవినేని నెహ్రు

Published Sun, Dec 13 2015 11:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి: దేవినేని నెహ్రు - Sakshi

టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలి: దేవినేని నెహ్రు

విజయవాడ: కాల్ మనీ ముఠాతో సంబంధమున్న టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో దేవినేని నెహ్రు మాట్లాడుతూ... కాల్ మనీ డబ్బుతో విదేశాల్లో జల్సా చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కాల్ మనీ ముఠాపై చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తే సహించమని దేవినేని నెహ్రు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement