RGV Suggested to Sri Reddy to Scold Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 7:59 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

I Suggested Sri Reddy Scold Pawan, Says RGV - Sakshi

సాక్షి, ముంబై : శ్రీ రెడ్డి వ్యవహారంపై విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ కాంట్రవర్సీలోకి పవన్‌ కల్యాణ్‌ను లాగమని శ్రీ రెడ్డితో చెప్పింది తానేనని ఆయన బాంబు పేల్చారు. అయితే పవన్‌ను విమర్శించటం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆమెకు ఆ సూచన చేశానని వర్మ చెప్పారు. ఈ మేరకు పవన్‌కు సారీ చెబుతూ ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వర్మ ఓ వీడియోను ఉంచారు. 

పవన్‌ను ఆ పదజాలంతో విమర్శించటంలో శ్రీ రెడ్డి తప్పేం లేదన్న వర్మ.. ఆమెను ప్రభావితం చేసింది తానేనని చెప్పుకొచ్చారు. పవన్‌ను విమర్శించటం ద్వారా కత్తి మహేశ్‌ పాపులర్‌ అయిన విషయాన్ని ఆమెతో ప్రస్తావించి.. పవన్‌ను టార్గెట్‌ చేయమని చెప్పానన్నారు. ఈ విషయంలో పవన్‌ను లాగినందుకు పవన్‌కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ వర్మ ఓ ట్వీట్‌ చేశారు.

డీల్‌ చేయడానికి యత్నించా...
గతంలో శ్రీ రెడ్డితో తానూ ఓసారి ఫోటో దిగానని.. తర్వాత నిరసనల ద్వారానే ఆమెను గుర్తుపట్టానని ఆయన తెలిపారు. సురేష్‌ తనయుడు అభిరామ్‌ ఫోటోలను లీక్‌ చేశాక.. సురేష్‌ ప్రొడక్షన్‌ లాంటి ప్రముఖ సంస్థ.. రామానాయుడు కుటుంబం పరువుకు భంగం కలగకూడదన్న ఉద్దేశ్యంతో తాను డీల్‌ చేయించేందుకు ముందుకు వచ్చానని వర్మ తెలిపారు. ఆ విషయం నిర్మాత సురేష్‌ బాబుకు కూడా తెలీదని ఆయన అన్నారు. అయితే శ్రీ రెడ్డి ఆ ఆఫర్‌ను(రూ.5 కోట్లు అని చివర్లో వెల్లడించారు) సున్నితంగా తిరస్కరించందని తెలిపారు. డబ్బున్న వాళ్లు కూడా కోట్ల డీల్‌ను వదులుకునేందుకు సిద్ధంగా ఉండరని.. అలాంటిది ఆమె వద్దనటంతో ఇష్యూపై ఎంత సిన్సియర్‌గా పోరాటం చేస్తుందో అర్థమైందని వర్మ తెలిపారు.

పవన్‌ను శ్రీ రెడ్డి విమర్శించటానికి పూర్తి బాధ్యత తనదేనని వర్మ స్పష్టత ఇస్తూ అందుకు క్షమాపణలు చెప్పారు. ఆమె గతం ఏంటన్నది పక్కనపెడితే.. ప్రస్తుతం ఆమె ప్రస్తావించిన అంశం(కాస్టింగ్‌ కౌచ్‌) మాత్రం ఇండస్ట్రీలో అందరూ ఒప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.  సుమారు 16 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement