శ్రీరెడ్డి వివాదం.. అనూహ్య మలుపులు! | Many Twists in Sri Reddy, Pawan Controversy | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 8:34 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Many Twists in Sri Reddy, Pawan Controversy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న క్యాస్టింగ్‌ కోచ్‌ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులపై ఆమె ఆరోపణలు చేశారు. వారికి సంబంధించిన ఫొటోలు, చాటింగ్‌లు బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో ట్విస్టు ఇచ్చారు. తన పోరాటాన్ని మరింతగా ముందుకుతీసుకెళ్లేందుకు పవన్‌ను తిట్టాలని తానే శ్రీరెడ్డికి చెప్పానని, ఈ వివాదం నేపథ్యంలో పవన్‌ను విమర్శించటం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న భావనతో తాను ఆమెకు ఈ సూచన చేశానని వర్మ వెల్లడించారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది.

టాలీవుడ్‌లో మహిళల అకృత్యాలపై పోరాటం కాస్తా.. శ్రీరెడ్డి, వర్మ, పవన్‌ కల్యాణ్‌ మధ్య వివాదంగా మారిపోయింది. వర్మ వెల్లడించిన విషయాలపై మెగా నిర్మాత అల్లు అరవింద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ నికృష్ణుడు, సాఫ్ట్‌ మర్డరర్‌ అంటూ అరవింద్‌ ధ్వజమెత్తారు. మొత్తానికి తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరో మలుపు తీసుకున్నట్టు కనిపిస్తోంది. దర్శకుడు వర్మపై మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారు? శ్రీరెడ్డా? రాంగోపాల్‌ వర్మనా? మెగా ఫ్యామిలీనా? అని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. ‘శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన చేస్తే క్యాష్‌ కమిటీ ఏర్పడుతోంది. ఒక స్టార్ ని బూతు మాట అంటే.. పరిశ్రమ పెద్దలు అందరూ స్పందిస్తారు. అంటే ఒక రకంగా శ్రీరెడ్డి చేసింది కరెక్టేనా! షాక్ ఇచ్చి షేక్ చేస్తేతప్ప సరైన స్పందన రాదా!?’ అని ఆయన ప్రశ్నించారు. ‘రాంగోపాల్ వర్మ తాను శ్రీరెడ్డితో చేసిన సోషియల్ ఎక్స్ పెరిమెంట్‌ను ఒప్పుకోకపోయి ఉంటే ఇదేదో పెద్ద రాజకీయ కుట్ర అని ఈపాటికి నిరూపించేవాళ్ళు. అసలు సమస్య పక్కదారి పట్టి విషయం ఎక్కడెక్కడికో వెళ్లిపోతోంది. బహుశా అందరికీ కావలసినది ఇదేనేమో’ అంటూ కత్తి మహేశ్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement