
సాక్షి, హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా ఒకింత మౌనంగా ఉన్న నటి శ్రీరెడ్డి తాజాగా మహేశ్‌బాబు సినిమా ‘భరత్ అనే నేను’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె ట్విటర్‌లో కామెంట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను. అసలు ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఎంటిరా.. బిలో యావరేజ్ మూవీ. మహేష్ బాబు క్రేజ్ వల్ల హిట్ టాక్ వచ్చింది. లేకపోతే పక్కా ఫ్లాప్. వరెస్ట్ డైరెక్షన్, కంటెంట్ లేని కథ, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ లేని యాక్టర్‌గా మహేష్ బాబుని తయారుచేస్తున్నారు’ అని ఆమె రివ్యూ ఇచ్చారు. దీంతో మహేశ్‌బాబు అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. వారి నుంచి విమర్శలు రావడంతో శ్రీరెడ్డి ఆ ట్వీట్లను తొలగించారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలను కొరటాల శివ తీవ్రంగా ఖండించాడు. ఈ నేపథ్యంలో ‘భరత్’ సినిమాపై ఆమె నెగిటివ్ ట్వీట్లు చేసి.. తొలగించారు. తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో మాత్రం ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ అయినందుకు మహేశ్‌బాబుకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మహేశ్ బాబు మాట్లాడాలని ఆమె కోరారు.
టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత కొన్నిరోజులు మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి.. టాలీవుడ్‌లో మహిళల సమస్యలు, తనపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్న వారిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment