
సింగర్‌గా, కథానాయికగా ఆండ్రియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఐదేళ్ల క్రితం ‘తడాఖా’లో నటించిన ఆండ్రియా ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు తెరపై కనిపిస్తున్నారు. సమ్మర్‌లో విడుదలైన మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’లో ‘ఇదే కలలా ఉన్నదే...’ పాట పాడింది ఆండ్రియానే. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఆయుష్మాన్ భవ’లో కనిపించనున్నారు. చరణ్ తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. ఇందులో స్నేహా ఉల్లాల్ కథానాయికగా నటించారు. సీటీఎఫ్ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వహించింది. ఈ సినిమాలో ఆండ్రియా సింగర్ జెన్నీఫర్ క్యారెక్టర్ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది.
చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణతో పాటు కథను అందించిన దర్శకుడు నక్కిన త్రినాథరావుగారికి, స్క్రీన్‌ప్లే అందించిన పరుచూరి బ్రదర్స్‌కు, సహ నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు మారుతికి ధన్యవాదాలు. ఆండ్రియా క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. క్యారెక్టర్ విన్న వెంటనే ఆండ్రియా ఒప్పుకున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ సంగీతం అందించారు. సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆండ్రియా ఫస్ట్ లుక్‌ను రీలీజ్ చేయనున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment