భరత్ అనే నేను సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో కాలేజ్ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. బర్త్‌డే కానుకగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయటం పక్కా అని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment