
నటి శ్రీరెడ్డి (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్ : గత కొంతకాలం నుంచి టాలీవుడ్‌లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి. వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన అనంతరం దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు అని ఏ భేదం లేకుండా ఇండస్ట్రీలో పలువురిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హైకోర్టులో శ్రీరెడ్డి ఇటీవల ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ పిటిషన్ విచారణకు రానుంది. పిటిషనర్ శ్రీరెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ కళానిధి వాదనలు వినిపించనున్నారు.
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ)కు చెందిన మురగదాస్, లారెన్స్, విశాల్‌లపై కూడా ఆరోపణలు చేశారు. వ్యభిచారం లాంటి వాటిలో అనుకోకుండా తానే పాల్గొన్నట్లు పరోక్షంగా శ్రీరెడ్డే వ్యాఖ్యానించారని, అందుకే కేసులు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయాలని నడిగర్ సంఘం పోలీసులను కోరింది. కాగా, హైకోర్టు శ్రీరెడ్డి పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందోనని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment