సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలను నిరసిస్తూ శనివారం నెక్లెస్‌రోడ్డు వద్ద జనసేన చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీరెడ్డి తీరును తప్పుబట్టారు. టాలీవుడ్‌లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై నిరసనగా ఆమె స్పందించిన తీరు ముమ్మాటికీ సరికాదన్నారు. ఏదైనా వివాదం ఉంటే, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకానీ అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, టీవీ ఛానెళ్లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు లీక్ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో మీడియా సెన్సేషనలిజం తప్ప సాధించేది ఏదీ లేదని అన్నారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. ‘పవన్ కల్యాణ్‌జీ ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు. మేమూ కూడా అంతే. టాలీవుడ్‌లోని కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగు అమ్మాయిల పట్ల మీకు కనీసం గౌరవం కూడా లేదు. మీరు బలవంతంగా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. అమ్మాయిలు పవన్ కల్యాణ్ మద్దతును ఎప్పుడూ అడగొద్దు. సినిమా పరిశ్రమపై అసహ్యం వేస్తోంది’ అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment