
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన నటి శ్రీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. శ్రీరెడ్డికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఫిల్మ్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించింది. శ్రీరెడ్డి వ్యవహారంలో బాధ్యులను రేపటిలోగా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌ను ముట్టడిస్తామని ఓయూ జేఏసీ హెచ్చరించింది.
ఇప్పటికే మహిళా సంఘాలు శ్రీరెడ్డికి అండగా నిలబడిన సంగతి తెలిసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీచేసింది. శ్రీరెడ్డి అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment