OU JAC
-
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. వారందరూ ఒక్కసారిగా బన్నీ ఇంటిలోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి రూ. కోటి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారి ఆందోళనకు గురైంది. వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసలకు సమాచారం అందడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
'సమాధానం చెప్పాల్సిందే.. లేకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం'
సాక్షి, హైదరాబాద్: యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై వివాదం నెలకొంది. ఇటీవల అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే డెడ్‌లైన్ విధించినా గవర్నర్ స్పందించకపోవడంపై విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అధికారాలను కూడా కేంద్రం తన ఆధీనంలో పెట్టుకుందని ఫైర్ అయ్యారు. గవర్నర్ బిల్లును ఆమోదించి పంపకపోతే కార్యాచరణ రూపొందించి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చిన గవర్నర్‌ను రీకాల్ చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లును తొక్కిపెట్టింది ప్రధాని మోదీనా.. కేంద్రమా? సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. యూనివర్శిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్) -
‘కరోనా కంటే భయంకరంగా కల్వకుంట్ల కరోనా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఓయూ జేఏసీ, తెలంగాణ మాదిగ దండోరా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– చట్టాల దుర్వినియోగం’ అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓయూ జేఏసీ ప్రతినిధి చారకొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు దేవర సతీష్ మాదిగ, ప్రొఫెసర్ అన్సారీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కన్నా రాష్ట్రంలో కల్వకుంట్ల కరోనా భయంకరంగా ఆవరించిందన్నారు. ప్రశ్నించినందుకు గతంలో మంద కృష్ణను రెండు నెలలు జైలులో పెట్టారని, తర్వాత ఎంతో మంది విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను మావోయిస్టు బూచి చూపి అరెస్టులు చేశారన్నారు. ప్రస్తుతం 111 జీవోలో అక్రమ కట్టడాలు బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు రేవంత్‌ను జైలులో పెడితే ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిని కూడా జైలులో పెట్టాలన్నారు. రేవంత్ ఏమైనా తీవ్రవాదా..? స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అక్రమంగా మరో 12 కేసులు బనాయించి బెయిలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడంలేదన్నారు. ఒకే పార్టీకి చెందిన తోటి ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే అదే పార్టీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని, మీరు అవలంభించిన విధానం వల్ల ఇకపై ఎవ్వరూ ఆ పార్టీలో చేరేందుకు జంకుతారని, ప్రస్తుతం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రశ్నార్థకంలో పడ్డారన్నారు. ఢిల్లీ నుంచి హైకమాండ్ ఒక న్యాయవాదిని పంపించారని, ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు. సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, రెడ్డి జాగృతి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు దుర్గయ్య గౌడ్, రమేష్, రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) -
‘ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేయండి’
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 35వ రోజు కొనసాగుతోంది. తమ ఆందోళనల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు శవివారం(నవంబర్ 9) రోజున చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్ మార్చ్ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ చేపట్టనున్న చలో ట్యాంక్‌బండ్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు అక్రమ అరెస్ట్‌లను జేఏసీ నేతలు ఖండించారు. రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకోవాలి : అశ్వత్థామరెడ్డి కార్మికుల అక్రమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఇళ్లలో దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళ కార్మికులను కూడా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని.. పోలీసులు దమనకాండ ఆపాలని అన్నారు. అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ రోజు రాత్రి వరకు కార్మికులందరూ హైదరాబాద్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ముగ్దుం భవన్లో అఖిలపక్ష సమావేశం.. సమ్మె, భవిష్యత్ కార్యచరణపై చర్చించేందకు ఓయూ జేఏసీతో ఈయూ కార్యాలయంలో జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని ఆర్టీసీ జేఏసీ రద్దు చేసుకుంది. కార్మికుల అక్రమ అరెస్ట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముగ్దుం భవన్లో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్టులపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసీ జలదీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆర్టీసీకి చెందిన ఇద్దరు కార్మికలు బలవనర్మణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా జలదీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాంపస్‌లో నిరసన చేపట్టిన పలువురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నాగార్జున డౌన్ డౌన్ నినాదాలు; ఉద్రిక్తత!
సాక్షి, జూబ్లీహిల్స్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు. బిగ్‌బాస్ షోను నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. జేఏసీ నాయకులు డాక్టర్ కందుల మధు, వేల్పులకొండ వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వేధింపులపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా దృశ్యాలు చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బిగ్‌బాస్ షోను నిలిపివేసేలా కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని నాగార్జున ఇంటి వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం సాయంత్రం నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు నాగార్జున ఇంటి ముందు కాపలాను పెంచారు. అటు వైపు వస్తున్న అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. ‘బిగ్‌బాస్’పై హెచ్చార్సీలో ఓయూ జేఏసీ ఫిర్యాదు ‘బిగ్‌బాస్’ షోను నిలిపివేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. జేఏసీ నాయకులు డాక్టర్ కందుల మధు, వేల్పులకొండ వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వేధింపులపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా దృశ్యాలు చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బిగ్‌బాస్ షోను నిలిపివేసేలా కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
శ్రీరెడ్డి: బాధ్యులను రేపటిలోగా పీఎస్‌లో అప్పగించాలి!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన నటి శ్రీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. శ్రీరెడ్డికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఫిల్మ్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించింది. శ్రీరెడ్డి వ్యవహారంలో బాధ్యులను రేపటిలోగా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌ను ముట్టడిస్తామని ఓయూ జేఏసీ హెచ్చరించింది. ఇప్పటికే మహిళా సంఘాలు శ్రీరెడ్డికి అండగా నిలబడిన సంగతి తెలిసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీచేసింది. శ్రీరెడ్డి అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
వైఎస్సార్ సీపీ కార్యాలయం ముట్టడి..
హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులు సోమవారం ముట్టడించారు. కర్నూలులో వైఎస్ జగన్ తలపెట్టిన జలదీక్షను నిరసిస్తూ విద్యార్థులు ముట్టడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
హెచ్‌సీయూ విద్యార్థులకు ఓయూ జేఏసీ మద్దతు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఓయూ జేఏసీ రెండు రోజుల పాటు నిరసన తెలపనుంది. ఆ కార్యక్రమ వివరాలను జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ నెల 25 న హెచ్‌సీయూ ముట్టడితో పాటు 26 న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
'పవన్ కళ్యాణ్ ను జనం రాళ్లతో కొడుతారు'
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. మెదక్ లోకసభకు జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)కి జన సేన మద్దతిస్తే.. పవన్ కళ్యాణ్ ను జనం రాళ్లతో కొడుతారని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు బుద్ది చెప్పారని ఆయన అన్నారు. మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓయూ జేఏసీ మద్దతు తెలుపుతోందని పిడమర్తి తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పిడమర్తి రవితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తమ ఉద్యోగులు ఏవరూ పనిచేయరని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. -
పోలవరం విషయంపై న్యాయపోరాటం చేస్తాం
-
జైరాం రమేష్‌ను అడ్డుకున్న ఓయూ జెఎసి
-
ఏపీ భవన్లో పెరిగిన బీపీ
ఇరుప్రాంత జేఏసీల నిరసనలతో వేడెక్కుతున్న ఏపీ భవన్ బుధవారం సైతం కొనసాగిన పోటాపోటీ నిరసనలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు నేపథ్యంలో దేశ రాజధానిలో మోహరించిన ఇరుప్రాంత జేఏసీ నేతల ఆందోళనలతో ఏపీభవన్ వేడెక్కుతోంది. తెలంగాణ, సీమాంధ్ర జేఏసీలు పోటాపోటీ నిరసనలకు దిగుతుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు ప్రతినినాదాలు, నేతల అడ్డగింతల నేపథ్యంలో అప్రమత్తమయిన ఢిల్లీ పోలీసులు భారీగా భవన్లో మోహరించారు. గురువారం విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుం డా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. బుధవారం సైతం ఏపీభవన్‌లో పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఓవైపు తెలంగాణ విద్యార్థి, రాజకీయ, న్యాయవాద జేఏసీలు అంబేద్కర్ విగ్రహం వద్ద సంపూర్ణ తెలంగాణకు మద్దతుగా నిరసనలకు దిగగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు పక్కనే భవన్ మెట్ల వద్ద బైఠాయించారు. పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణవాదులు బోనాలతో పాటలు పాడుతూ తమ నిరసనను సాయంత్రం వరకు కొనసాగించారు. ఏపీఎన్జీవోలు సైతం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మధ్యాహ్నం వరకు అక్కడే నిరసన తెలిపారు. ఏపీ భవన్ మాదే: ఓయూ జేఏసీ ఇక సాయంత్రం ఏపీ భవన్ తెలంగాణదే అంటూ ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు నిరసనకు దిగారు. ‘నిజాం ఆస్తి.. తెలంగాణ ప్రజల ఆస్తి, ఆంధ్రాభవన్ కాదు.. తెలంగాణ భవన్’ అంటూ రాసిన భారీ ఫ్లెక్సీని ఏపీభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. దీనిపై భవన్ అధికారులు అభ్యంతరం చెబుతూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నించినా, విద్యార్థుల ఆందోళనతో మిన్నకుండిపోయారు. మీడియా సెంటర్ ఎత్తివేత.. పోటీ నిరసనలు, మీడియా ముందు పోటాపోటీ నినాదాల నేపథ్యంలో ఏపీ భవన్లో మీడియాపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం భవన్లో శాంతిభద్రతలను పర్యవేక్షించిన తిలక్‌మార్గ్ పరిధి డీసీపీ త్యాగి అక్కడి మీడియా సెంటర్‌ను ఎత్తేయించారు. సుమారు 50 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయించారు. భవన్ బయట మీడియాతో సీమాంధ్ర నేతలు చలసాని శ్రీనివాస్, అడారి కిశోర్ మాట్లాడుతుండగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. -
జబ్బర్ ట్రావల్స్ కార్యాలయం ఎదురుగా ఓయూ జెఎసి ఆందోళన
-
సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించిన నేపథ్యంలో ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌ను బుధవారం ఓయూ జేఏసీ ముట్టడించింది. సీఎంకు నిరసనగా ఓయూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓయూ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. కాగా, శ్రీధర్‌బాబును తొలగించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు సీఎం పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారిలో మరింత ఆగ్రహన్ని పెంచింది. వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఏపీ ఎన్జీవోల సభను అడ్డుకుని తీరుతాం
హైదరాబాద్ : ఈనెల 7వ తేదీన జరగనున్న ఏపీఏన్జీవోల సభను అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసీ స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో జేఏసీ నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శనివారం రంగారెడ్డి, హైదరాబాద్ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అదే రోజు జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు 7న సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 7న ఎల్బీ స్టేడియలో జరిగే.. ఎపీ ఎన్జీవోస్ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో సహా తరలివెళ్తామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. సభను సీమాంధ్ర ఉద్యోగులకు మరింత అవగాహన కలిగించడానికి ఉద్దేశించి జరుతున్నట్లు వారు తెలిపారు. గురువారం కూడా సచివాలయంలో ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఏ ప్రాంతంవారికి వ్యతిరేకంగా ఈ బహిరంగ సభను నిర్వహించడంలేదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. -
ఏపీఎన్జీవోలు- ఓయూ జేఏసీ నేతల పోటాపోటీ నిరసనలు
ఏపీ ఎన్జీవోలు, ఓయూ జేఏసీ నేతలు పోటాపోటీ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో భారీగా సమైక్యాంధ్ర సభ నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. అదే రోజున అదే ఎల్బీ స్టేడియం వేదిగా మరో భారీ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ సిద్ధమవుతోంది. చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాన్ని ఈనెల ఏడో తేదీన నిర్వహిస్తామని, అందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీని కలిసింది. ఆరోజు తాము శాంతి ర్యాలీ నిర్వహించి ఎల్బీ స్టేడియానికి వెళ్తామని ఓయూ జేఏసీ నాయకులు డీసీపీకి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ ఎన్జీవోలు తాము హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ సంఖ్యలోనే సీమాంధ్ర ప్రాంత వాసులు ఉన్నారని, వాళ్ల ప్రయోజనాలను సైతం కాపాడాలని అంటున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌధ, జలసౌధ లాంటి ప్రాంతాల్లో ఏపీ ఎన్జీవోలు - టీఎన్జీవోల మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కానీ, నేరుగా ఇలా బహిరంగ సభలలో కూడా పోటాపోటీగా వ్యవహరించడం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు తొలిసారిగా అలాంటి దృశ్యం కూడా ఆవిష్కృతం అవుతుందో.. లేదా పోలీసులు ఎవరో ఒకరికి అనుమతి నిరాకరించి అడ్డుకుంటారో చూడాల్సిందే.