హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులు సోమవారం ముట్టడించారు. కర్నూలులో వైఎస్ జగన్ తలపెట్టిన జలదీక్షను నిరసిస్తూ విద్యార్థులు ముట్టడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.