
హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. వారందరూ ఒక్కసారిగా బన్నీ ఇంటిలోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి రూ. కోటి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అయితే, అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారి ఆందోళనకు గురైంది. వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసలకు సమాచారం అందడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment