
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆర్టీసీకి చెందిన ఇద్దరు కార్మికలు బలవనర్మణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా జలదీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాంపస్‌లో నిరసన చేపట్టిన పలువురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.