సాక్షి, హైదరాబాద్: యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై వివాదం నెలకొంది. ఇటీవల అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే డెడ్‌లైన్ విధించినా గవర్నర్ స్పందించకపోవడంపై విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
గవర్నర్ అధికారాలను కూడా కేంద్రం తన ఆధీనంలో పెట్టుకుందని ఫైర్ అయ్యారు. గవర్నర్ బిల్లును ఆమోదించి పంపకపోతే కార్యాచరణ రూపొందించి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చిన గవర్నర్‌ను రీకాల్ చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.
బిల్లును తొక్కిపెట్టింది ప్రధాని మోదీనా.. కేంద్రమా? సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. యూనివర్శిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: (OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్)
Comments
Please login to add a commentAdd a comment