jala deeksha
-
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల జలదీక్షలు
-
13న టీపీసీసీ నేతల ‘గోదావరి జలదీక్ష’
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఈ నెల 13న సందర్శించి వాటి పురోగతి విషయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేస్తామని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయ న పార్టీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా గోదావరి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టులను సందర్శించి అక్కడ స్థానిక మీడియా తో ప్రాజెక్టు స్వరూపం గురించి మాట్లాడతామని తెలిపారు. (డబుల్’ పింఛన్లపై వేటు!) ఈ సందర్భంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలమైన ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీమంత్రి శశిధర్‌రెడ్డి, ఎల్లంపల్లి వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, గౌరవెల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బల రాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, అలీసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మండలిలో మాజీ విపక్ష నేత షబ్బీర్ అలీ దీక్షల్లో పాల్గొంటారని ఆయన ప్రకటనలో వివరించారు. (పరిశ్రమలకు పరిపుష్టి) పోతిరెడ్డిపాడు పోరాట కమిటీ ఏర్పాటు ఇక కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తమ్ తెలిపారు. మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చైర్మెన్‌గా, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కన్వీనర్‌గా 12 మంది సభ్యులతో కమిటీని ఆయన ప్రకటించారు. కమిటీ సలహాదారులుగా సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యవహరిస్తారని, సభ్యులుగా మాజీమంత్రులు చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి, కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలునాయక్, టీపీసీసీ నేతలు లింగారెడ్డి, శ్రీహరి ముదిరాజ్, రామలింగయ్య యాదవ్, దొంగరి వెంకటేశ్వర్లు, సీహెచ్ ఎల్.ఎన్.రెడ్డిలను నియమిస్తునట్టు ఆయన వెల్లడించారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసీ జలదీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆర్టీసీకి చెందిన ఇద్దరు కార్మికలు బలవనర్మణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా జలదీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాంపస్‌లో నిరసన చేపట్టిన పలువురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నీళ్లను దోచుకెళ్తే చూస్తూ ఊరుకోం..
మెదక్‌రూరల్ : ఇసుక దోపిడీ, భూముల దోపిడీ చాలదన్నట్లు టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీళ్లను దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు జలాలను విడుదల చేయాలని, 885 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మండలం మాచవరం శివారులోని ఎమ్ఎన్ కెనాల్ వద్ద కాంగ్రెస్ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ సింగూరు జలాలను వెంటనే విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా.. నీళ్లు విడుదల చేయకపోవడంతో వేసిన నాట్లు వేసినట్లే ఎండిపోతున్నాయన్నారు. కెనాల్ పరిధిలోని నార్లు సైతం ముదురుతున్నాయన్నారు. సింగూరులో 29 టీఎంసీల నీరు ఉంటే 15 టీఎంసీల నీటిని మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌కు తరలించారన్నారు. దీంతో 14 టీఎంసీల నీరు మాత్రమే సింగూరులో ఉందన్నారు. 16.5 టీఎంసీల నీరు ఉంటేనే ఘనపురం కాల్వలోకి సింగూరు జలాలను విడుదల చేయాలంటూ 885 జీఓను తీసుకురావడం దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు. కేసీఆర్‌ను సీఎం చేయడం, హరీశ్‌రావును మంత్రిని చేయడం, పద్మాదేవేందర్‌రెడ్డిని ఉపసభాపతిని చేయడమే రైతులు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు రైతుల జీవితాల్లో చేదు సింగూరు డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు కూడా రైతులకు నీళ్లు వదిలిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. సింగూరు జలాలు రైతుల హక్కు అని, మరో ఐదు రోజుల్లో సింగూరు నీటిని విడుదల చేయకుంటే రైతులతో కలిసి ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో తెలంగాణ పాలకులు నీళ్లను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదాక రైతులు పంటలు పండించుకోవద్దా ? అన్ని ప్రశ్నించారు. జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల్లో చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి చెరుకు రైతుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేదు నింపిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను త్వరలో ఎండగడతామన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి డీఆర్వో రాములుకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి మెదక్ పట్టణంలో రాస్తారోకో చేయగా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాత్రావు, చంద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలకృష్ణ, ఆంజనేయులు, శ్యాంసుందర్, శ్రీకాంత్, నరేందర్, మార్గం నాగరాజు, మేకల అంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ మెదక్, పాపన్నపేట, కొల్చారం రైతులు ఉన్నారు. జలదీక్షకు అనూహ్య స్పందన జలదీక్షకు మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల నుండి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సభా ప్రాంగణంలో రైతులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించి భోజనాలు చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల ఎమ్ఎన్ కెనాల్ కిక్కిరిసింది. సింగూరు నీటిని విడుదల చేసి పంట పొలాలను సస్యశామం చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా కోసం రాజమండ్రిలో జలదీక్ష
-
హోదా కోరుతూ చెవిరెడ్డి జలదీక్ష
-
ప్రత్యేకహోదా కోరుతూ జలదీక్ష
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ కృష్ణవేణి ఘాట్‌లో సీపీఐ పుష్కర జలదీక్ష చేపట్టింది. మూడు కోట్ల పుష్కర యాత్రికుల పుణ్యాన్ని ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబులు తీసుకుని ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. లేదంటే వారికి పిండ ప్రధానం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో జలదీక్ష జరిగింది. -
మోదీ, కేసీఆర్ అంటే బాబుకు భయం
- జలదీక్ష ముగింపు సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి - ‘ఓటుకు కోట్లు’ కేసు వల్లే కేసీఆర్ అంటే బాబుకు వణుకు - అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తాడని మోదీ అంటే భయం - ఏమీ అడగలేని వాడివి ఢిల్లీ ఎందుకు పోయావు బాబూ? - కేసీఆర్.. ఎగువ రాష్ట్రాలపై జరిపిన ఉమ్మడి పోరును గుర్తుచేసుకోండి - మనం గొడవలు పడొద్దు... వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎక్కడ జైల్లో వేయిస్తారోనని భయపడే కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన మంత్రులను కేంద్ర కేబినెట్లో నుంచి ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్రమోదీకి అల్టిమేటం ఇచ్చే దమ్ము, ధైర్యం బాబుకు లేవని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎం అని చెప్పుకునేందుకు అందరం సిగ్గు పడుతున్న పరిస్థితి ఉందని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో వైఎస్ జగన్ చేపట్టిన జల దీక్ష బుధవారం (18వ తేదీ) సాయంత్రం ముగిసింది. రైతులు కురువ వెంకోబారావు, సుబ్బారెడ్డి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని ఆయన దీక్ష విరమించారు. ‘తెలంగాణ ప్రాజెక్టులపై రెండు నెలల సమయం ఇస్తున్నాం.. అప్పటికీ మార్పురాకపోతే గోదావరిపై దీక్షల ద్వారా మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం’’ అని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణా పరీవాహక ప్రాంతంలో పోరాటం చేస్తున్నామని.. ఈ దీక్షలతో నెల, రెండు నెలల్లోగా వీళ్లల్లో మార్పు వస్తుందేమోనని ఎదురుచూస్తామన్నారు. లేనిపక్షంలో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. కర్నూలు ‘జలదీక్ష’ ముగింపు సభలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... ‘‘కేసీఆర్‌ను ఒక్క మాట అడగదలచుకున్నా. మొన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం. ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ర్ట, కర్ణాటక వాళ్లు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే కలిసికట్టుగా వ్యతిరేకించాం. ఇప్పుడు మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలానికి నీరు రాకముందే మహబూబ్‌నగర్ నుంచే 800 అడుగులు లోపే పంపులు పెట్టి నీటిని పైనే తోడేస్తామనడం న్యాయమా? గోదావరి నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తుందని చెప్పి.. గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్‌లోకి రాకమునుపే ఎడాపెడా ప్రాజెక్టులు కట్టి దాదాపుగా రోజూ 70 వేల క్యూసెక్కుల నీరు తోడేసుకుంటే.. కింద ఉన్న రైతులకు నీళ్లు ఎలా వస్తాయనే ఆలోచన కూడా రావడం లేదా? మా రాష్ట్రం పైన ఉండి మీ రాష్ర్టం కింద ఉండి ఉంటే...మేం కనుక నీళ్లు ఆపి ఉంటే మీకు నచ్చేదా? ఇవాళ కావలసింది మనం మనం తన్నుకోవడం, గొడవలు పడటం కాదు. అందరం కలిసికట్టుగా ఒక్కటై ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం.. అన్యాయం జరక్కుండా చూడడం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అందరం కలసికట్టుగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలి. ప్రతి చుక్కలో ఎవరి వాటా వారికి రావాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి నీటిని కిందకు వదిలే విధానం రావాలి. జైల్లో పెట్టిస్తారనే చంద్రబాబు భయం.. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోటి నుంచి ఎలాంటి మాటా రావడం లేదు. కొన్నాళ్ల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రూ. 5 నుంచి రూ. 25 కోట్లు లంచం ఇస్తూ చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్‌ను గట్టిగా నిలదీస్తే ఆయన ఓటుకు కోట్లు కేసు బైటకు తీస్తాడని చంద్రబాబుకు భయం. ఆ టేపులు బైటకు తీసి జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం. పోనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీనన్నా అడుగుతారా అంటే.. ఈ 24 నెలల్లో చేసిన అవినీతి మీద సీబీఐతో విచారణ వేయించి జైల్లో పెట్టిస్తారేమోనని చంద్రబాబు భయం. మీరు గనుక ఇవన్నీ చేయకపోతే మా మంత్రులను మీ కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవు. చంద్రబాబూ నువ్వు కేసీఆర్‌ను నిలదీయలేవు. నరేంద్ర మోదీని నిలదీయలేవు. మరి ఢిల్లీకి ఎందుకెళ్లావయ్యా అని చంద్రబాబును అడుగుతున్నా. ఏం చేయడానికి వెళ్లావయ్యా అని అడుగుతున్నా. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మోదీతో ఏమీ మాట్లాడారో తెలియదు. ప్రత్యేక హోదా వస్తే ఏం మంచిది? ఏమీ జరగదు అని ఈయనే అంటాడు. ఢిల్లీకి వెళ్లి ఏం సాధించావని నిలదీస్తారేమోనని ఈయనంతకు ఈయనే ప్రత్యేక హోదా వస్తే ఏం మేలు అని ఎదురు ప్రశ్నిస్తాడు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడు కాబట్టి... కేసీఆర్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని ఢిల్లీలోమోదీకి ఫిర్యాదు చేస్తారేమోనని ఆశగా ఎదురుచూశాం. దీక్షలు చేస్తున్నాం. ధర్నాలు చేస్తున్నాం. ఫిర్యాదు సంగతి దేవుడెరుగు.. బాబు బైటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై మీ వైఖరి ఏమిటని చంద్రబాబును ఒక విలేకరి అడిగితే... ‘అన్ని అనుమతులు తీసుకుని కట్టాలి...సీడబ్ల్యుసీ అనుమతి తీసుకోవాలి...కేంద్రం పరిష్కరించాలి!’ ఇవీ ముఖ్యమంత్రి మాటలు. ఇవన్నీ మాకు తెలియవా అని చంద్రబాబును అడుగుతున్నా. ఇవేవీ లేకుండా వాళ్లు కడుతుంటే నువ్వు ఏమి చేస్తున్నావు? ఇటువంటి వ్యక్తి మనకు సీఎం అని చెప్పుకునేందుకు నిజంగా అందరం కూడా సిగ్గు పడాల్సిన పరిస్థితి. -
మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
-
మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన వస్తోంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఏపీకి జరుగుతున్న జల అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ చేస్తున్న నిరాహారదీక్షకు రెండో రోజు జిల్లాల నుంచి జనం పోటెత్తారు. కర్నూ లు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, జనం భారీగా తరలివచ్చి ప్రియతమ నేత వైఎస్ జగన్ కు మద్ధతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సాగిస్తున్న నిరాహారదీక్షకు వెల్లువలా మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు, ధర్నాలతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలకడం విశేషం. ఉదయం ఎనిమిది గంటల నుంచే వైఎస్ జగన్ దీక్షా వేదిక వద్ద తన కోసం వచ్చిన జనాన్ని కలుసుకుంటున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చి దీక్ష వద్ద కూర్చుని మద్ధతుగా నిలుస్తున్నారు. మంగళవారం పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి వైఎస్ జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు ప్రకటించారు. -
జనం కోసం... జలం కోసం..!
కాకినాడ :కృష్ణానదిపై అనుమతి లేకుండా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిరసన వెల్లువెత్తింది. జలదోపిడీని అడ్డుకోలేకపోతున్న అధికార తెలుగుదేశం పార్టీ వైఫల్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. గోదావరి డెల్టాను ఎడారిగా మారుస్తోన్న ప్రభుత్వ విధానాలను ‘జలదీక్ష’ ద్వారా ఎలుగెత్తి చాటింది. రైతులకు అండగా ఎలాంటి ఉద్యమానికైనా సన్నద్ధమంటూ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ భరోసానిచ్చింది. కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజులపాటు చేపట్టిన జలదీక్షకు మద్దతుగాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను కాంక్షిస్తూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు కొనసాగించాయి. ఒక వైపు మండుటెండ ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా జనం కోసం... జలం కోసం... జగన్ కోసం... తాము ముందుంటామని జిల్లాలోని పార్టీ శ్రేణులు నిరూపించాయి. తెలంగాణా ప్రభుత్వ జలదోపిడీపై అవసరమైతే ప్రజలపక్షాన ఎలాంటి పోరాటాలకైనా సన్నద్దమని సంకేతాలిచ్చాయి. ఎక్కడెక్కడ ఎలా... కాకినాడ రూరల్‌లో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో... కర్నూలులో జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. నీటి దోపిడీని అరికట్టకపోతే భవిష్యత్తు అంథకారమేనని తెలియజెప్పేలా మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఖాళీ బిందెలతో నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, డిప్యూటీ ప్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో... రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షల్లో పాల్గొని అక్రమ ప్రాజెక్టులపై నిరసించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. కోనసీమలో జలదీక్ష విజయవంతమైంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే దీక్షల్లో సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి పలువురు పార్టీ నేతలు పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, మిండగుదిటి మోహన్, దంగేటి రాంబాబు, బొమ్మి ఇజ్రాయిల్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లో జలదీక్ష విజయవంతమైంది. ఆయా మండలాల్లో జరిగిన దీక్షల్లో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిదిలో పిఠాపురం ఉప్పాడ సెంటర్లో, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో దీక్షలు నిర్వహించారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జలదీక్ష చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన దీక్షకు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ హాజరై సంఘీభావం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా, హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో దీక్షలు విరమింపచేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కర్నూల్లో జగన్ జలదీక్షకు హాజరు కాగా ఆయన ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట, రావుపాలెం, ఆత్రేయపురం, ఆల మూరు మండలాల్లో ఆయా మండల కేంద్రాల్లో చేపట్టిన జలదీక్ష విజయవంతమైంది. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కో-ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో కోట్రేనికోన, తాళ్ళరేవు మండలాల్లో జగన్ దీక్షకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. ఆయా మండలాలకు చెందిన పార్టీ నేతలు దీక్షలకు హాజరయ్యారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురులలో దీక్షలు చేపట్టారు. రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లిలో జరిగిన దీక్షల్లో సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పినిపే విశ్వరూప్, రాష్ట్ర కార్యదర్శులు మిండకుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీను ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేశారు. రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలో కో-ఆర్డినేటర్ అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో మండలకార్యాలయం ఎదుట రిలేదీక్ష చేశారు. మరో కో-ఆర్డినేటర్ బొంతురాజేశ్వరరావు కర్నూలులో జగన్ జలదీక్షకు హాజరు కాగా ఆయన పిలుపు మేరకు మల్కిపురంలో నాయకులు, కార్యకర్తలు జలదీక్ష చేశారు. మండపేట నియోజకవర్గం మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యాలలో నిరాహారదీక్షలు చేశారు. అనపర్తి యర్రకాలువ సమీపంలోని వైఎస్ విగ్రహం వద్ద నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని రంగంపేట, పెదపూడి మండల కేంద్రాల్లో కూడా అక్కడి పార్టీ నేతలు దీక్షలు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గోకవరం,గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో జలదీక్ష విజయవంతమైంది. నాలుగు మండలాల్లో జరిగిన జలదీక్షలకు పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. జగ్గంపేట సెంటర్లో వైఎస్ విగ్రహం వద్ద రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో, గోకవరం మండలంలో దేవిచౌక్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేశారు. కిర్లంపూడిలో పెనగంటి రాజేష్, దాడి అప్పలరాజు ఆధ్వర్యంలో, గండేపల్లిలో నాయకులు సుంకవిల్లి శ్రీనివాస్, పాము సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శిబిరాలలో ఒమ్మి రఘురామ్ పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు, శంఖవరం మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జలదీక్షలను సక్సెస్‌చేశారు. ఏలేశ్వరంలో జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య, ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు చిడగం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, ప్రత్తిపాడులో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలోను, రౌతులపూడిలో పార్టీ నాయకుడు వాసిరెడ్డి జమీలు అన్నవరంలో జలదీక్షలు చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ విలీన మండలాల రోడ్‌షొలో ఉండగా, వీరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పలుచోట్ల దీక్షలు చేపట్టారు. రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లో జలదీక్ష నిర్వహించారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆకులవీర్రాజు ఆధ్వర్యంలో హుక్కుంపేటలో రూరల్ మండల పరిషత్కార్యాలయం ఎదుట దీక్షలు చేశారు. మాజీ ఎంపీ, కోఆర్డినేటర్ గిరిజాల వెంకటస్వామినాయుడు స్థానికంగా లేకపోవడంతో కడియంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు(బాబు) ఆధ్వర్యంలో కడియం కాలువలో జల నిరసన దీక్ష చేశారు. రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, ముంజి నాగేంద్ర పాల్గొన్నారు. -
జల ఘోష!
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలదీక్షకు జనం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు మండల కేంద్రాల్లో నిర్వహించిన సంఘీభావ దీక్షలకు భారీగా జనం కదలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆశల్ని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కార్యక్రమాలకు హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో సీఎం విఫలమయ్యూరని, ఆయన చేతగాని తనం వల్లే రాష్ట్రంలో దుర్బర పరిస్థితులు దాపురించాయని మండిపడ్డాయి. నేటి నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారుతుందని, ప్రజల తర ఫున పోరాడుతున్న జగన్‌కు మద్దతుగా రైతులు కదలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. * జగన్ జలదీక్షకు వెల్లువెత్తిన జన సంఘీభావం * మండల స్థాయిలో కదిలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు * అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుంటే రాష్ట్రం ఎడారే * నేటి నిర్లక్ష్యం.. భావి తరాలకు శాపం * సీఎం చేతగాని తనం వల్లే సమస్యలని ధ్వజం * జలదీక్షకు మద్దతుగా రైతులు కదలిరావాలని పార్టీ నేతల పిలుపు ఒంగోలు: కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యూరు. ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రం ఎడారిలా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో జలదీక్ష బూనారు. ఈ దీక్షకు మద్దతుగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. మిగులు జలాలకు అవకాశమేది..? యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని వైఎస్సార్ తపించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మిగులు జలాల ఆధారంగా కేటాయించినదని, ఈ నేపథ్యంలోపైన అక్రమ ప్రాజెక్టులు చేపడితే ఇక మిగులు జలాలు ఎక్కడనుంచి వస్తాయో ప్రజానీకం గమనించాలన్నారు. కనుక ప్రతి ఒక్కరు అక్రమ కట్టడాలను నిరసించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు కదలిరావాలన్నారు. వై.పాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు మండలాల్లో ధర్నాలు జరిగాయి. మేలుకోకుంటే సాగు కలే.. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో జలదీక్ష కార్యక్రమం కొత్తపట్నం మండల తహశీల్దారు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఒంగోలు నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణానదిపై తెలంగాణా ప్రభుత్వం కడుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోతే రాష్ట్రం ఎడారే అన్నారు. సమస్యలను ఎదుర్కోలేక ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనుగోలుచేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రతి ఒక్కరు నేడు అసహ్యించుకుంటున్నారన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దామరాజు క్రాంతికుమార్ తదితరులు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని నమ్మి అక్కచెల్లెళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, రైతన్నలు అయినా మేలుకోకపోతే భవిష్యత్‌లో సాగు కూడా గగనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సీ లంకపోతు అంజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆళ్ళ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మండల తహశీల్దారు రవిబాబుకు వినతిపత్రం అందించారు. చారిత్రాత్మక దీక్ష.. దర్శి మండల తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగిన దీక్షకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అక్రమ కట్టడాలను ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష చారిత్రాత్మకం అన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించి ఆయనకు మరింత స్ఫూర్తిని అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎంపిపి దేవదానం, జిల్లా నాయకులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల గడియార స్తంభం సెంటర్లో జరిగిన ధర్నాకు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరికూటి అమృతపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే జగన్మోహన్రెడ్డి జలదీక్షకు పిలుపు ఇచ్చారన్నారు. ఈ దశలో రైతులంతా సంఘటితమై భవిష్యత్‌లో తాము ఎదుర్కోబోయే సమస్యను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్, రాష్ట్ర కార్యదర్శి కోండ్రురాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమించాల్సిన సమయమిదే.. కొరిశపాడు మండలం కేంద్రం వద్ద జరిగిన ధర్నాకు మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు నాయకత్వం వహించారు. గిద్దలూరులో జరిగిన దీక్షకు జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి అరుణ్‌యాదవ్ హాజరుకాగా, రాచర్లలో జరిగిన కార్యక్రమాలకు యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దుగ్గా రాంమోహన్‌రెడ్డిలు హాజరయ్యారు. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పిసిపల్లి, పామూరు మండలాల్లో జరిగిన ధర్నాకు జిల్లా అధికారప్రతినిధి తమ్మినేని శ్రీనివాసులరెడ్డి హాజరుకాగా, కనిగిరిలో దీక్షకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రంగనాయకులురెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు చేతగానితనం వల్లే రాష్ట్రానికి దుస్థితి దాపురించబోతోందన్నారు. కొండపి నియోజకవర్గంలో జరిగిన దీక్షకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు హాజరయ్యారు. మాఫీ మాఫీ అంటే జనం బాకీలు రద్దువుతాయనుకున్నారని, కానీ నేడు రద్దవుతున్నది ప్రజల ఆశలు అని అందరికీ అర్థమైందన్నారు. కేవలం రెండు సంవత్సరాలలోనే దారుణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అంటూ ధ్వజ మెత్తారు. కొండపిలో జరిగిన ధర్నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఢాకా పిచ్చిరెడ్డి హాజరయ్యారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారుతుందని, కనుక రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని వినతి పత్రాలు.. పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లులో జరిగి ధర్నాకు మండల నాయకులు బండారు ప్రభాకర్ జిల్లా కార్యదర్శి వీరగంధం ఆంజనేయులు నాయకత్వం వహించారు. చినగంజాం మండలంలో జరిగినధర్నాకు ఎంపీపీ ఆసోది భాగ్యలక్ష్మి నేతృత్వంలో ధర్నా ఘనంగా జరిగింది. సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రమైన సంతనూతలపాడులో జరిగిన ధర్నాకు పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, దుంపా యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందించారు. మద్దిపాడులో ఎంపీపీ నారా విజయలక్ష్మి నేతృత్వంలో మండల తహశీల్దారు కె.ఎల్.నరసింహారావుకు వినతిపత్రం అందించారు. -
జలదీక్షకు జనప్రవాహం
♦ కర్నూలులో మూడో రోజుకు చేరిన జగన్ నిరాహార దీక్ష ♦ జలదీక్షకు మద్దతు ప్రకటించిన వివిధ ప్రజా సంఘాలు కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ... కేంద్ర ప్రభుత్వ దృష్టికి జల అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న నిరాహారదీక్షకు రెండో రోజు జనం పోటెత్తారు. కర్నూ లు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, జనం జాతరలాగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే జగన్ దీక్షా వేదిక వద్ద తన కోసం వచ్చిన జనాన్ని కలుసుకోవడం ప్రారంభించారు. ఎండలు మండిపోతున్నా దూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అన్ని వైపుల నుంచీ జనం ఒక్కసారిగా దీక్షా ప్రాంగణంలోకి వచ్చి పడటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అదుపు చేయలేక పోయారు. జనం రద్దీని గమనించిన జగన్ కూడా విరామం లేకుండా వారిని రాత్రి ఎనిమిది గంటల వరకూ కలుస్తూనే ఉన్నారు.ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు ప్రకటించారు. బాబు తీరుపై జనాగ్రహం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న జల అన్యాయంపై జగన్ నిరాహారదీక్ష చేస్తూ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు దీక్షకు వచ్చిన జనానికి ఆగ్రహం కలిగించాయి. ఓటుకు కోట్లు కేసు ఉచ్చు తనకు బిగుస్తుందేమోనన్న భయంతోనే చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో చర్చల సందర్భంగా ప్రత్యేక హోదాపై గట్టిగా అడగలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీక్షలు, ధర్నాలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు తెలంగాణ రాష్ర్ట్టం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న నిరాహారదీక్షకు వెల్లువలా మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు, ధర్నాలతో మంగళవారం రాష్ర్టవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలకడం విశేషం. -
రెండోరోజు వైఎస్ జగన్ జలదీక్ష
-
వైఎస్ జగన్ జలదీక్ష ప్రారంభం
-
పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబాటే
కర్నూలు: నదులపై ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కడుతూ నీళ్లు వాడుకుంటున్నారని, మనకు ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయని, దీనిపై పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబడిఉంటామని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష వేదికపై ఆమె మాట్లాడారు. రాయలకాలంలో రత్నాలసీమగా పేరుగాంచిన రాయలసీమ నేడు వెనుకబడిపోవడానికి నీళ్లు లేకపోవడమే కారణమని బుట్టా రేణుక అన్నారు. నీళ్లులేకపోతే ఎలా అభివృద్ధి చెందుతామని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఏవిధంగా న్యాయం చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదని చెప్పారు. చంద్రబాబు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం కలసివుంటే ఇలాంటి సమస్యలు రావనే ముందుచూపుతో సమైక్యఉద్యమం చేశామని చెప్పారు. -
అడ్డుగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుని, ఇరు రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడుతున్నాయని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష వేదికపై ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో తాగడానికి నీళ్లు కూడా రావని అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా కింద పంటలసాగు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రాయలసీమ ప్రజలు ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నారని, నీళ్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెప్పారు. -
వైఎస్ జగన్ జలదీక్ష ప్రారంభం
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జలదీక్ష ప్రారంభించారు. వరుసగా మూడు రోజులు నిరాహారదీక్ష చేస్తారు. కర్నూలులో నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలోని దీక్షావేదికపై దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ పులివెందుల నుంచి కర్నూలు బయల్దేరారు. పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు నగరం చేరుకోగానే జగన్నాథగట్టు వద్ద ఆయనకు వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మురళి తదితరులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిష్క్రియాపరత్వంపై నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు జగన్ ఈ నిరాహారదీక్షకు దిగారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ జలదీక్ష
♦ మూడ్రోజులు నిరాహారదీక్ష ♦ కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిఘటన.. కర్నూలు నుంచి సాక్షి ప్రతినిధి: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు కర్నూలులో నిరవధిక నిరాహారదీక్ష చేయడానికి రంగం సిద్ధం అయింది. నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో దీక్షా వేదికపై ఆయన సోమవారం ఉదయం తన నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిష్క్రియాపరత్వంపై నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు జగన్ ఈ నిరాహారదీక్షకు పూనుకుంటున్నారు. 16న జగన్ మూడు రోజుల నిరాహారదీక్ష ప్రారంభం కానుండగా మరుసటి రోజైన 17వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో జలదీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఉదయానికి కర్నూలు చేరుకోనున్న జగన్ మూడు రోజుల నిరాహారదీక్ష చేయనున్న జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు దీక్షా వేదికకు చేరుకుంటారు. దీక్షకు వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారమే కర్నూలుకు చేరుకుని జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డితో ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు వై.ఐజయ్య, వై.విశ్వేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డి తదితరులు కూడా దీక్షాస్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
'వైఎస్ జగన్ జలదీక్షకు సర్వం సిద్ధం'
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ దీక్షను ప్రారంభిస్తారని చెప్పారు. కృష్ణా జలాల నీటి మళ్లింపు.. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ జలదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. మే 16 నుంచి మే 18 వరకు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ జలదీక్ష కొనసాగనున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా అన్ని మండల హెడ్‌క్వార్టర్స్‌లలో మే 17న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు జలదీక్ష చేపట్టనున్నట్టు తలశిల రఘురాం పేర్కొన్నారు. కర్నూలు వేదికగా మూడు రోజుల పాటు సాగే వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు కర్నూలుకు చేరుకుంటున్నారు. వైఎస్ జగన్ జలదీక్షకు రాయలసీమ, కృష్ణా డెల్టా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే జలదీక్ష ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే విశ్వేశ్శర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, జయరాములు, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పర్యటించారు. -
జంతర్‌మంతర్ వద్ద వైయస్ జగన్ జల దీక్ష
-
పోలీస్ కమీషనర్ని కలిసిన వైఎస్సాఆర్ సీపీ నేతలు
-
వైఎస్సార్సీపీ యువజన అధ్వర్యంలో జలదీక్ష
-
విశాఖపట్నంలో జగన్‌కు మద్దతుగా జలదీక్ష