కృష్ణానదిపై అనుమతి లేకుండా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిరసన వెల్లువెత్తింది. జలదోపిడీని అడ్డుకోలేకపోతున్న
కాకినాడ :కృష్ణానదిపై అనుమతి లేకుండా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిరసన వెల్లువెత్తింది. జలదోపిడీని అడ్డుకోలేకపోతున్న అధికార తెలుగుదేశం పార్టీ వైఫల్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. గోదావరి డెల్టాను ఎడారిగా మారుస్తోన్న ప్రభుత్వ విధానాలను ‘జలదీక్ష’ ద్వారా ఎలుగెత్తి చాటింది. రైతులకు అండగా ఎలాంటి ఉద్యమానికైనా సన్నద్ధమంటూ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ భరోసానిచ్చింది. కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజులపాటు చేపట్టిన జలదీక్షకు మద్దతుగాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు మిన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను కాంక్షిస్తూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు కొనసాగించాయి. ఒక వైపు మండుటెండ ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా జనం కోసం... జలం కోసం... జగన్ కోసం... తాము ముందుంటామని జిల్లాలోని పార్టీ శ్రేణులు నిరూపించాయి. తెలంగాణా ప్రభుత్వ జలదోపిడీపై అవసరమైతే ప్రజలపక్షాన ఎలాంటి పోరాటాలకైనా సన్నద్దమని సంకేతాలిచ్చాయి. ఎక్కడెక్కడ ఎలా...
కాకినాడ రూరల్‌లో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో...
కర్నూలులో జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. నీటి దోపిడీని అరికట్టకపోతే భవిష్యత్తు అంథకారమేనని తెలియజెప్పేలా మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఖాళీ బిందెలతో నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, డిప్యూటీ ప్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురంలో...
రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షల్లో పాల్గొని అక్రమ ప్రాజెక్టులపై నిరసించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు.
కోనసీమలో జలదీక్ష విజయవంతమైంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే దీక్షల్లో సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి పలువురు పార్టీ నేతలు పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, మిండగుదిటి మోహన్, దంగేటి రాంబాబు, బొమ్మి ఇజ్రాయిల్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లో జలదీక్ష విజయవంతమైంది. ఆయా మండలాల్లో జరిగిన దీక్షల్లో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిదిలో పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో దీక్షలు నిర్వహించారు.
కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జలదీక్ష చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన దీక్షకు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ హాజరై సంఘీభావం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా, హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో దీక్షలు విరమింపచేశారు.
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కర్నూల్‌లో జగన్ జలదీక్షకు హాజరు కాగా ఆయన ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట, రావుపాలెం, ఆత్రేయపురం, ఆల మూరు మండలాల్లో ఆయా మండల కేంద్రాల్లో చేపట్టిన జలదీక్ష విజయవంతమైంది. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కో-ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో కోట్రేనికోన, తాళ్ళరేవు మండలాల్లో జగన్ దీక్షకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. ఆయా మండలాలకు చెందిన పార్టీ నేతలు దీక్షలకు హాజరయ్యారు.
నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురులలో దీక్షలు చేపట్టారు. రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లిలో జరిగిన దీక్షల్లో సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పినిపే విశ్వరూప్, రాష్ట్ర కార్యదర్శులు మిండకుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీను ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేశారు. రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలో కో-ఆర్డినేటర్ అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో మండలకార్యాలయం ఎదుట రిలేదీక్ష చేశారు. మరో కో-ఆర్డినేటర్ బొంతురాజేశ్వరరావు కర్నూలులో జగన్ జలదీక్షకు హాజరు కాగా ఆయన పిలుపు మేరకు మల్కిపురంలో నాయకులు, కార్యకర్తలు జలదీక్ష చేశారు.
మండపేట నియోజకవర్గం మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌లు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యాలలో నిరాహారదీక్షలు చేశారు.
అనపర్తి యర్రకాలువ సమీపంలోని వైఎస్ విగ్రహం వద్ద నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని రంగంపేట, పెదపూడి మండల కేంద్రాల్లో కూడా అక్కడి పార్టీ నేతలు దీక్షలు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు.
జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గోకవరం,గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో జలదీక్ష విజయవంతమైంది. నాలుగు మండలాల్లో జరిగిన జలదీక్షలకు పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. జగ్గంపేట సెంటర్‌లో వైఎస్ విగ్రహం వద్ద రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో, గోకవరం మండలంలో దేవిచౌక్ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేశారు. కిర్లంపూడిలో పెనగంటి రాజేష్, దాడి అప్పలరాజు ఆధ్వర్యంలో, గండేపల్లిలో నాయకులు సుంకవిల్లి శ్రీనివాస్, పాము సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శిబిరాలలో ఒమ్మి రఘురామ్ పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు, శంఖవరం మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జలదీక్షలను సక్సెస్‌చేశారు. ఏలేశ్వరంలో జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య, ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు చిడగం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, ప్రత్తిపాడులో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలోను, రౌతులపూడిలో పార్టీ నాయకుడు వాసిరెడ్డి జమీలు అన్నవరంలో జలదీక్షలు చేశారు.
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ విలీన మండలాల రోడ్‌షొలో ఉండగా, వీరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పలుచోట్ల దీక్షలు చేపట్టారు.
రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లో జలదీక్ష నిర్వహించారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆకులవీర్రాజు ఆధ్వర్యంలో హుక్కుంపేటలో రూరల్ మండల పరిషత్‌కార్యాలయం ఎదుట దీక్షలు చేశారు. మాజీ ఎంపీ, కోఆర్డినేటర్ గిరిజాల వెంకటస్వామినాయుడు స్థానికంగా లేకపోవడంతో కడియంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు(బాబు) ఆధ్వర్యంలో కడియం కాలువలో జల నిరసన దీక్ష చేశారు. రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, ముంజి నాగేంద్ర పాల్గొన్నారు.