హోదాపై మాట్లాడలేదని అలిగారంట: శ్రీరెడ్డి | Sri Reddy on Tollywood Special Status Fight | Sakshi
Sakshi News home page

May 1 2018 11:23 AM | Updated on Mar 23 2019 9:10 PM

Sri Reddy on Tollywood Special Status Fight - Sakshi

నటి శ్రీ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. టాలీవుడ్‌ హోదాపై ఎందుకు స్పందించటం లేదని పరోక్షంగా ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాం. అదేనండీ బిల్డింగ్‌ కోసం డబ్బులు అడగటం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలను ఆమె పోస్ట్‌ చేశారు. 

చిరుకు చేదు అనుభవం.. మా సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్‌ వెళ్లిన మెగాస్టార్‌ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమించటం లేదంటూ ప్రవాస భారతీయులు ఆయన్ని నిలదీశారు. చిరు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన కార్యక్రమానికి వారంతా నల్ల దుస్తులతో వచ్చి నినాదాలు చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావటంతో ఖంగుతినటం చిరంజీవి వంతైంది. ఇక ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాల సందర్భంగా కొందరు ఎన్నారైలు ఫ్లకార్డ్లతో ఆడిటోరియం బయట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

అది పాత వీడియో... ఎన్నారై అభిమానుల ఆప్యాయతకు చిరు కంటతడి పెట్టుకున్నట్లు కొన్ని వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. క్లీన్‌ షేవ్‌తో ఉన్న చిరు మాట్లాడిన ప్రసంగం అది. సోషల్‌ మీడియాతోపాటు కొన్ని ఛానెళ్లలోనూ అవి వైరల్‌ కావటం విశేషం. దీనిపై ప్రవాసాంధ్రులు స్పష్టత ఇచ్చారు. అవి పాత వీడియోలని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement