సాక్షి, సినిమా: నీ పళ్లు రాలగొడతా.. అని నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై నటి శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. సుచీలీక్స్ తరహాలో ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది నటి శ్రీరెడ్డి. కొద్ది రోజులుగా కాస్టింగ్ కౌచ్ గురించి బహిర్గం చేస్తానంటూ ట్విట్టర్‌లో బెదిరింపులకు దిగింది. తాజాగా రెండు రోజుల కిందట తనకు న్యాయం చేయాలంటూ రొడ్డుకెక్కింది. కాగా శ్రీరెడ్డి లీక్స్ గురించి స్పందించిన అతి కొద్దిమంది నటీమణుల్లో రకుల్‌ప్రీత్‌సింగ్ ఒకరు. కాస్టింగ్ కౌచ్ గురించి తనకు తెలియదని, అలాంటి సంఘటన తనకు ఎదురు కాలేదని ఆమె పేర్కొంది. దీనికి కౌంటర్‌గా రకుల్‌పై శ్రీరెడ్డి మండిపడింది. రకుల్‌కి కాస్టింగ్ కౌచ్ గురించి తెలియదు. అలాంటి అనుభవం తనకు ఎదురవ్వలేదు అని అంటుందా? అంటూ ఫైర్ అయ్యింది.
అయినా కోట్ల రూపాయలు పారితోషికం పొందుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ లాంటి వాళ్లు కాస్టింగ్ కౌచ్ గురించి ఎందుకు మాట్లాడతారు? అంది. హైదరాబాద్‌లో జిమ్‌ను నిర్వహిస్తూ, పెట్టుబడి పెట్టింది. ముంబైలో బంగ్లాలు కొంటోంది. అలాంటప్పుడు మా లాంటి వారి బాధ ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. బాలీవుడ్ నటీమణులు ఇక్కడ ఆడంబర జీవితాలను అనుభవిస్తున్నారని ఆరోపణలు చేసింది. తాను నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను హెచ్చరిస్తున్నా తనలాంటి వారి పోరాటాలను తక్కువ చేసి మాట్లాడితే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతాను అని మండిపడింది. ప్రస్తుతం ఈమె వ్యవహారం వివాదంగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఇదే అంశం వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment