
రాజమండ్రి ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్
రాజమండ్రి : తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. ‘ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను’ అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం తరువాత రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను వివాదంలోకి లాగటంపై మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీ వర్గాలు సీరియస్ అయ్యాయి. నటుడు శివ బాలాజీ పవన్ ను దూషించినందుకు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.