
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ శ్రీరెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, న్యూస్ చానల్‌లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల క్రితం కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి హుమయున్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీరెడ్డి కోరారు.
‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆమె చెన్నైలో మకాం పెట్టారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్, సుందర్.సి, నటులు రాఘవ లారెన్స్, శ్రీరామ్, హీరో విశాల్‌లపై కూడా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో శ్రీరెడ్డిపై చాలా మంది కేసులు పెట్టారు. (చదవండి: విలన్‌గా యాంకర్ అనసూయ..!)
Comments
Please login to add a commentAdd a comment