
వివాదాస్పద నటి శ్రీరెడ్డి వైఎస్సార్‌సీపీ ఘనవిజయంపై స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళిపై అంతే వేగంగా స్పందించారు. వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు.
నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సర్కార్‌కు లైన్ క్లియర్ అయింది. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. అటు ప్రశ్నిస్తాను అంటూ ఊగిపోయిన నటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ సోదిలో కూడా లేకుండా తోక ముడిచింది. ఈ నేపథ్యంలోనే తన పగతీరిందంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార‍్హం. దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పోస్ట్‌పై విరుచుకు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment