ఆమెను చూసి అంతా వణికిపోతున్నారు | RGV says, Industry People Fears with Sri Reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 2:33 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

RGV says, Industry People Fears with Sri Reddy - Sakshi

శ్రీ రెడ్డి(శ్రీ శక్తి).. రామ్‌ గోపాల్‌ వర్మ (ఫైల్‌ ఫోటోలు)

టాలీవుడ్‌ను శ్రీ రెడ్డి వ్యవహారం కుదిపేస్తున్న సమయంలో కాస్టింగ్ కౌచ్‌ అంశంపై స్పందించాడు విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఇండస్ట్రీలో అది ఏనాటి నుంచో పాతుకుపోయిందని.. ఇప్పుడు శ్రీ రెడ్డి చేస్తున్న పోరాటానికి  హ్యాట్సాఫ్‌ అని పేర్కొన్నాడు. ఆమె చేస్తున్న పోరాటానికి మద్ధతుగా వర్మ స్టేట్‌ మెంట్లు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆర్జీవీ మళ్లీ ట్వీట్లేశాడు. ‘శ్రీరెడ్డి నిజాయితీని ఎదుర్కొన లేక ఇండస్ట్రీలో ఉన్న మగాళ్లు సైతం వణికిపోతున్నారు. కొందరు మహిళలు ఆమెకు వస్తున్న పాపులారిటీని భరించలేక అసూయతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ధైర్యం-నిజాయితీ ఉన్న మహిళలు మాత్రం శ్రీ స్త్రీ శక్తిని(తాజాగా ఆమె తన పేరును శ్రీ శక్తిగా మార్చుకున్నారు) అనుసరిస్తున్నారు’ అని ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు.

‘మరికొందరు ఆమె గతంలో చేసిన పనులను, ఆమె మాట్లాడిన అసభ్య భాషను గుర్తు చేస్తూ.. ఆమె ఉద్యమకారిణి కాదని వాదిస్తున్నారు. వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఆశోకుడు కూడా యుద్ధంలో చాలా మంది చంపాడు. తర్వాతే ఆయన హృదయం కరిగిపోయి లక్షలాది మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఆ లెక్కన్న శ్రీరెడ్డి కూడా అశోకుడంతటి గొప్ప వ్యక్తి’ అంటూ వర్మ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement