Sri Reddy Comments On Sri Rama Chandra: వివాదాస్పద నటి శ్రీరెడ్డి బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయొద్దంటూనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థించింది. 'శ్రీరామచంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ ఇతడు గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ కాదు. అనవసరమైన వ్యక్తులను, రియాలిటీగా ఉండకుండా నటించేవాళ్లను, ఫేక్ పర్సన్‌లను అస్సలు నమ్మొద్దు.
షణ్ముఖ్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అతడు చాలా టాలెంట్ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టా. అదిప్పటికీ గుర్తుంది. షణ్ముఖ్ డౌన్ టు ఎర్త్, ఫేక్‌గా ఉండడు, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడని విన్నాను. ఏదో అప్పుడప్పుడు రెండు మూడు క్లిప్పింగులు చూస్తానంతే.. నిజానికి బిగ్‌బాస్ పెంట గురించి మాట్లాడటమే వేస్ట్. కానీ ఈ పెంటలో కూడా నష్టం జరగకూడదు కాబట్టి షణ్ముఖ్‌కు ఓటేయండి. శ్రీరామచంద్ర నాతో చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు లీకయ్యాయి. అదంతా నిజంగానే జరిగింది.
ఇలా ఉన్నాడు కాబట్టే అంత పెద్ద ఇండియన్ ఐడల్ అవార్డు కొట్టినా కూడా అక్కడే ఉండిపోయాడు. చేసిన పాపాల వల్లే పైకి ఎదగలేదు. ఇండియన్ ఐడల్‌ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్‌లు చేయడం, ఇంకా ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం అతడిది. ఇలాంటి వ్యక్తులకు ఓటేయకుండా షణ్ముఖ్‌లాంటి మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించండి. ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ ఇలా చెప్పడం లేదు. దయచేసి ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు? అనేది తెలుసుకుని ఓటేస్తారనుకుంటున్నాను' అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment