Silk Smitha Biopic: Interesting Actress Roped for సిల్క్‌స్మిత జీవితకథ - Sakshi
Sakshi News home page

మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి

Published Fri, Feb 12 2021 6:21 PM | Last Updated on Fri, Feb 12 2021 7:42 PM

Not Anasuya, Its Sri Reddy To Act In Silk Smitha Biopic - Sakshi

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటి సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్‌ రోల్‌ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అధికారికంగా  వెల్లడించింది. గత కొన్ని రోజులుగా గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ ఊరిస్తున్న శ్రీరెడ్డి ఎట్టకేలకు సన్సెస్‌ను రివీల్‌ చేసింది. దిగ్గజ నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. ఇక టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌తో తీవ్ర దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి)

సిల్క్‌ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బయోపిక్‌లో శ్రీరెడ్డి నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట సిల్క్‌ స్మిత బయోపిక్‌లో యంకర్‌ అనసూయ నటించనున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్త‌లు గుప్పుమ‌నడంతో  ఈ పుకార్ల‌కు అన‌సూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో న‌టించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. ఇప్పటికే సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో 2011లో డర్టీ పిక్చర్‌ పేరుతో విడుదలైన సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. (కంగనా సవాల్‌.. నా కంటే గొప్ప నటిని చూపించగలరా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement