శ్రీరెడ్డి షేర్ చేసిన ఫొటో
టాలీవుడ్, కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి బయోపిక్‌కు రంగం సిద్దమైంది. సినీ పరిశ్రమలో తనకు ఎదురైన పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సోమవారం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ‘రెడ్డి డైరీ’ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంగం హామీ ఇచ్చినందుకు శ్రీరెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రంలో ‘కాస్టింగ్ కౌచ్’ ఒరిజినల్ వీడియోలు చూపించబోతున్నామని సంచలన ప్రకటన చేశారు.
తన ఫేస్‌బుక్‌లో సైతం ’అమ్మ జయలలిత గారి ఆశీస్సులతో తమిళంలో నా తొలి చిత్రాన్ని లాంఛ్ చేస్తున్నాను. ఈ చిత్రానికి ‘రెడ్డి డైరీ’ పేరును ఖరారు చేశాము. చిత్రై సెల్వన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రవి దేవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’ అంటూ మీడియా సమావేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment