
విశాల్, శ్రీరెడ్డి
తమిళసినిమా: విశాల్ సారీ.. ఈ మాట అన్నదెవరో తెలుసా? సంచలన టాలీవుడ్ నటి శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలువురు సినీ సెలబ్రిటీల గుట్టు విప్పి వారి పరువును బజారు పాలు చేసి, మరి కొందరి చీకటి భాగోతాల చిట్టా విప్పుతానని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ సంచలన నటి తాజాగా కోలీవుడ్ మీద పడింది. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, సుందర్.సీ, రాఘవ లారెన్స్, శ్రీకాంత్ వంటి వారిపై ఆరోపణలు గుప్పించి కలకలం సృష్టించింది. దీంతో శ్రీరెడ్డి తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడిన మరి కొందరి పేర్లను బయట పెడతానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
దీంతో నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ శ్రీరెడ్డిపై తీవ్రగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాఉండగా ఆయన తనను బెదిరిస్తున్నారంటూ శ్రీరెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించింది. ఇది తీవ్ర కలకలానికి దారితీసింది. ఇలాంటి పరిణామాలనంతరం తాజాగా శ్రీరెడ్డి ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో విశాల్‌ను క్షమాపణ కోరుకుంటున్నానని పేర్కొంది. నన్ను క్షమించండి విశాల్. నటీమణులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే స్థానంలో మీరు ఉన్నారు. మీ వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని శ్రీరెడ్డి అంది. సడన్‌గా ఈ అమ్మడు ఇలా ప్లేట్ ఫిరాయించి మెతక వైఖరిని అవలంభించడానికి కారణం ఏమై ఉంటుందబ్బా అని కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment