
మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య, చిత్రంలో శ్రీరెడ్డి
హిమాయత్‌నగర్ : క్యాస్టింగ్‌కౌచ్ విధానంపై పోరాడిన తనకు మీడియా ఎంతో సపోర్ట్ చేసిందని నటి శ్రీరెడ్డి అన్నారు. నటి శ్రీరెడ్డి ఆధ్వర్యంలో ‘సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌కౌచ్ మరియు కోఆర్డినేటర్ విధానాన్ని నిర్మూలించాలి. 90శాతం తెలుగు బిడ్డలకి అవకాశాలు కల్పించాలి’ అనే డిమాండ్‌తో ‘మూవీ ఆర్టిస్ట్ న్యూ అసోసియేషన్’ సభను ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. సినీరంగం సమాజానికి మంచి మెసేజ్‌తో ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలే తప్ప.. కోట్లాది రూపాయిల వ్యాపారం చేసుకుంటూ, చెడు వ్యాప్తి చెందేలా, నాగరికతను కించేపరిచేలా ఉండకూడదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రతిభ దాగి ఉన్న వారిని కాస్టింగ్‌కౌచ్ పేరుతో వేధించడం సరైన పరిణామం కాదన్నారు.
సినిపరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించి, కో–ఆర్డినేటర్ విధానాన్ని నిర్మూలించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. ఇండస్ట్రీలో జరుగుతున్న దోపిడీ, అత్యాచారాలు, అవమానాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విధానాన్ని అరికట్టి నటీనటులకు ఓ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సినీపరిశ్రమ పెద్దలపై ఉందని ఉమెన్ యాక్టివిస్ట్ తేజస్విని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నటి అపూర్వ, సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment