నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌‌ | Actress Sri Reddy Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌‌

Jun 5 2018 11:51 AM | Updated on Jul 18 2019 1:41 PM

Actress Sri Reddy Comments On Nara Lokesh - Sakshi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్‌ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న ఆమె.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు.

ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్‌ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రస్తావించకుండా.. ‘‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, అక్కడ పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్‌ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు?’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు.

బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డి?: అతి త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌-2 రియాలిటీ షోలో శ్రీరెడ్డి కూడా ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేనప్పటకీ సదరు షోపై నటి పలు కామెంట్లు చేశారు. బిగ్‌బాస్‌పైన కూడా మెగా ఫ్యామిలీ ప్రభావం ఉందని, హోస్ట్‌ నానికి తనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విబేధాలున్నాయని శ్రీరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement