
సాక్షి, హైదరాబాద్: క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మెగా అభిమానులు స్పందిస్తున్నారు. ఓ అభిమాని ‘నువు చేసే పోరాటం వేరు.. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నావా.. కేవలం నీ పోరాటం గురించి.. నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడు ఒకే కానీ.. ప్రతిదానిలో వేలు పెడితే నీ పోరాటం చులకన అయిపోతుంది.. ఎవరో చెప్పేది విని అనవసరంగా రాంగ్ స్టెప్ వేయకు..’ అని బదులిచ్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.