praja rajyam party
-
సినిమాల్లో డబ్బులు చాలకే ఈ ప్రజారాజ్యం,జనసేన పార్టీలు : KA Paul
-
పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..
లష్కర్ల రేల్ గాడి ఎక్కితె అద్ద గంటల మా వూర్కి బోవచ్చు. మా వూరు బోన్గిరి. బోన్గిరిల బాహర్పేటల మేము ఉండెటోల్లం. ఊల్లె నాకందరు సుట్టాలే. పొట్ట తిప్పలకు పట్న మొచ్చి యాభై ఏండ్లయితున్నది. బోన్గిరిల పోశమ్మ గుడి ఎదురుంగ మా ఇల్లున్నది. మా పక్కింట్ల యాద్గిరి మామ ఉన్నడు. మామ అంటె సంత మామ గాదు. వర్సకు మామ. పనిబడ్తె గాయిన పట్నమొచ్చిండు. పనంత అయినంక ఆనంద్ బాగ్ల ఉంటున్న మా ఇంటికొచ్చిండు. గాయినను సూడంగనే నాకు మా వూరును సూసినట్లనిపిచ్చింది. పట్నం మంచి చెడ్డ లర్సుకునే తంద్కు కుద్దు వూరే నడ్సుకుంట నాతాన్కి వొచ్చినట్లు గొట్టింది. ‘మామా! బాగున్నావె’ అని అడ్గిన. ‘బాగున్నర’ అని యాద్గిరి మామ అన్నడు. గా ముచ్చట గీ ముచ్చటైనంక గాయిన రాజకీయాలల్లకు దిగిండు. ‘ఏం మామా! ఎప్పుడు రాజకీయాలు మాట్లాడ్తవేందే?’ ‘రాజకీయాలు గాన్ది ఏమన్న ఉన్నదా? రామాయనమంత రాజకీయమే. బారతమంత రాజకీయమే’ అన్కుంట యాద్గిరి మామ సిగిలేట్ ముట్టిచ్చిండు. ‘విబీషనుడు గోడ దుంకి రాముని దిక్కుకు వొచ్చిండు. గోడ దుంకె బట్కె అన్న జాగల లంకకు రాజైండు. గదే తీర్గ తెలుగు దేసం కెల్లి టీఆర్ఎస్లకు దుంకిన తలసాని, కాంగ్రెస్ కెల్లి దుంకిన సబితా ఇంద్రారెడ్డి అసుంటోల్లు మంత్రులయ్యిండ్రు. ఎలచ్చన్ల ముంగట గోడ దుంకుట్లు ఎక్వయితయి. గోడ దుంకె టోల్లందరు గల్సి విబీషనునికి గుడి గట్టియ్యాలె. గాయినకు మొక్కి నంకనే పార్టి ఫిరాయించాలె.’ ‘బారతం సంగతేందే?’ ‘గంత ఆత్రమైతే ఎట్లరా? కౌరవులు, పాండవుల నడ్మ జాగ పంచాతి అయింది. గా పంచాతిని తశ్వ జేసెతంద్కు కిష్నుడు ఒక్క తీర్గ కోషిస్ జేసిండు. గాయినెంత కోషిస్ జేసినా సూది మొనంత జాగ గుడ్క పాండవులకిచ్చే సవాల్లేదని దురియోదనుడన్నడు. దాంతోని పాలోల్ల నడ్మ విద్దమొచ్చింది. కర్నున్ని ఎవ్వలు లేని జాగలకు కిష్నుడు దీస్క బోయిండు. నువ్వు సూతుని కొడ్కువు గాదు. కుంతి కొడ్కువు. నువ్వు పాండవుల దిక్కుకొస్తివా అంటె పెద్దన్నా అన్కుంట గాల్లు నీ కాల్లు మొక్కుతరు. నిన్ను రాజును జేస్తరు అని కిష్నుడన్నడు. గాయిన ఎంత గనం జెప్పినా కర్నుడిన లేదు. బీజేపీ దిక్కుకెల్లి ఇద్దరు సన్నాసి గాల్ల తోని ఇంకొకడు మొయినాబాద్ ఫాంహౌజ్కొచ్చిండ్రు. తలా నూరు కోట్ల రూపాయలే గాకుంట గనుల సుంటియి గుత్తకిప్పిస్తం అని ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, హర్షవర్దన్ రెడ్డిలను బుద్గ రిచ్చినా గాల్లు గోడ దుంక లేదు. ఇక ముంగట ఎవలన్న గోడ దుంకుమని అంటె చెప్పుతోని కొడ్తమని అనుండ్రి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కేసీఆర్ జెప్పిండ్రు’ అన్కుంట యాద్గిరి మామ గిలాస్ నీల్లు దాగిండు. ‘ఆంద్ర సంగతేంది?’ ‘ఆంద్రప్రదేస్ల పవన్ కల్యాన్ చెప్పు చేత్ల బట్కోని చెంగడ బింగడ ఎగురుతుండు. నాకు తిక్కుంది, గా దాన్కి లెక్క లేదు అన్కుంట శిగమూగుతుండు. విశాకపట్నం, చోళ హోటల్ల ప్రతాని మోదీని గల్సిండు. రొండు చేతులతోని చెప్పులు బట్కోని శిగమూగుత. ఒక చెప్పు మీరియ్యుండ్రి. ఇంకో చెప్పు చెంద్రబాబిస్తడు. చెప్పులను చేతులల్ల బట్టుకుంట. ముక్యమంత్రినైత అని అన్నడు.’ ‘శానేండ్ల కింద ముక్యమంత్రి కుర్సి కోసం చిరంజీవి ప్రజా రాజ్జెం బెట్టిండు. గప్పుడు గాయిన పార్టి గుర్తు సూర్యుడు. అరచేతి నడ్డుపెట్టి సూర్య కాంతి నాపలేరన్నడు. గని గా అరచెయ్యే సూర్యున్ని మాయం జేసింది. ప్రజా రాజ్జెంను దీస్కబోయి కాంగ్రెస్‌ల గల్పిండు. గాయిన తీర్గనే పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో మామా’ ‘కల్పినా కల్పొచ్చురా. పవన్ అనేటి పతంగిని చెంద్రబాబు ఎక్కిస్తున్నడు. వైఎస్సార్సీపీ మోదీ కాల్లు మొక్కుతున్నదని జనసేన లీడర్ బొలివేటి అంటె మల్లీ పారి అంటివా చెప్పు తెగుతది అని మల్లాది విష్ను అన్నడు. వారీ! నువ్వు కొల్వు ఇడ్సి పెట్టి పాత చెప్పుల దుక్నం బెట్టురా! రేల్ గాడికి సైమమైంది. వొస్తరా!’ అన్కుంట మామ బోయిండు. (క్లిక్ చేయండి: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) తోక: మొన్న చాచా నెహ్రూ జయంతి అయ్యింది. ‘బాల్ దివస్ శుభాకాంక్షలు’ అని ఒక లీడర్‌కు జెబ్తె – ‘నా బాల్ (జుట్టు) నల్ల గున్నది’ అని గాయిన అన్నడు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
120 చోట్ల జనసేన డిపాజిట్లు గల్లంతు
సాక్షి, అమరావతి: గత నెల 11న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలోని 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు సైతం అవాక్కయ్యారు. రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 21 లక్షలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు దక్కిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత పవన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పార్టీకి కంటే నోటాకు ఎక్కువ వచ్చిన ఓట్లు ఆరు దాకా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతి నగరం నియోజకవర్గాలు, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యానికే ఎక్కువ సీట్లు: 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుపొందగా.. 2019 ఎన్నికల్లో పోటీచేసిన జనసేన ఇక్కడ కనీసం డిపాజిట్లు దక్కించుకోకపోవడం గమనార్హం. అలాగే, ప్రజారాజ్యం పార్టీ 13 జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోగా.. జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో గెలుపొందగా కేవలం మూడంటే మూడు చోట్లే రెండో స్థానంలో నిలిచింది. అవి గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఫలితాలపై జూన్‌లో జనసేన విశ్లేషణ: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునేందుకు జూన్ మొదటి వారంలో పార్టీ అభ్యర్థులతో విజయవాడలో సమావేశాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ నాయకులు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. -
జనసేన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది
సాక్షి, అమరావతి: జనసేన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, పార్టీ సంస్థాగత పటిష్టతకి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ అభిమానులతో వేర్వేరుగా ఆయన శనివారం విజయవాడలో సమావేశమయ్యారు. ఆయా సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే అందరూ బూత్ కమిటీల గురించే మాట్లాడుతూ, జనసేన పార్టీ బూత్ కమిటీలు ఎప్పుడు వేస్తోందంటూ తనను ప్రశ్నిస్తున్నారని, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు నిజమైన బూత్ కమిటీలు ఉన్నాయా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. అందరికీ తెలిసినంత వరకు సీపీఐ, సీపీఎం, బీజేపీ లాంటి పార్టీలకు కొంతవరకు బూత్ కమిటీలు ఉన్నాయని, అలా ఉన్నప్పటికీ వారు ఎన్నికల్లో ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. మన అండతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గానీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ గానీ మనల్ని రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడని రోజులు ఉన్నాయన్నారు. అటువంటి పార్టీలు ఇప్పుడు జనసేన మాతో కలసి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. వాళ్లకి మన అవసరం ఉందేమోగానీ మనకు మాత్రం వాళ్ల అవసరం లేదన్నారు. 60 శాతం కొత్త వ్యక్తులకే సీట్లు.. వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 60 శాతం మంది కొత్త వ్యక్తులకే సీట్లు ఇస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతంలో దీన్ని తు.చ. తప్పకుండా పాటిస్తామన్నారు. చిరంజీవి లాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అవినీతి అంతమవుతుందని ఆనాడు ప్రజలు ఆకాంక్షించారని, అయితే అది పక్కదారి పట్టిందని చెప్పారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలోకి ఎవరెవరో వచ్చారని, పార్టీ ఓడిపోగానే వెళ్లిపోయారన్నారు. దానివల్లే పార్టీ లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. పీఆర్పీలోకి వచ్చిన వారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి ఒక బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారన్నారు. రాజకీయాలకు డబ్బు అవసరం లేదని రుజువు చేసిన మార్గదర్శి కాన్షీరాం అని, ఆయనే తనకు స్ఫూర్తి అని పవన్ తెలిపారు. -
ప్రజారాజ్యం అందుకే విఫలమైంది : పవన్ కల్యాణ్
సాక్షి, విజయవాడ : ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఓపిక లేని నాయకులు పార్టీలో చేరడం వల్లే ప్రజారాజ్యం విఫలమైందని అభిప్రాయపడ్డారు. శనివారం పలు జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో లేదన్నారు. ప్రజారాజ్యం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కమిటీల నియమకాల విషయంలో తొందరపడలేదన్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే కనీసం 25 ఏళ్లు ఓపిక పట్టాలని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతున్నట్లు పేర్కొన్నారు. -
ప్రశ్నించడానికి.. రక్త సంబంధం అడ్డొస్తోందా?
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా) : జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని ఎద్దేవా చేశారు. మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావని పవన్‌ను చింతమనేని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా అని మండిపడ్డారు. అలాంటి వాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా, జనసేన పార్టీ ఎందుకు పెట్టావు అంటూ నిప్పులు చెరిగారు. ‘పవన్ కల్యాణ్ నీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు’ అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
మెగా ఫ్యామిలీలో ఒకరు నాకు బాగా క్లోజ్: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మెగా అభిమానులు స్పందిస్తున్నారు. ఓ అభిమాని ‘నువు చేసే పోరాటం వేరు.. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నావా.. కేవలం నీ పోరాటం గురించి.. నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడు ఒకే కానీ.. ప్రతిదానిలో వేలు పెడితే నీ పోరాటం చులకన అయిపోతుంది.. ఎవరో చెప్పేది విని అనవసరంగా రాంగ్ స్టెప్ వేయకు..’ అని బదులిచ్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. -
హస్తం అదృశ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జిల్లాలో 12 శాసనసభా నియోజకవర్గాలుండగా..నాడు 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఆ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి వంటి వాళ్లు అనేక మంది వచ్చి ప్రచారం చేశారు. అంత చేసినా..కనిగిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కనిగిరిలో 2603 ఓట్లు పోలవ్వగా.. కనిష్టంగా కందుకూరులో 641 ఓట్లు వచ్చాయి. ఒంగోలులో 1424, అద్దంకిలో 1387, గిద్దలూరులో 1933, దర్శిలో 1177, మార్కాపురంలో 1550, యర్రగొండపాలెంలో 1322, కొండపిలో 1081, పర్చూరులో 1275 ఓట్లు, సంతనూతలపాడులో 1263, చీరాలలో 974 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇటువంటి ఓటింగ్ పొందిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. పోటీ చేసిన వారికి ప్రచారం కోసం నిధులిస్తారని భావించి కొంత మంది ముందుకొచ్చారు. అయితే అదికూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ప్రచారం సైతం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చిరంజీవి గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆయన సభలకు వచ్చారు. ఈ ఎన్నికలకు జనం లేక కొన్ని సభలను రద్దు చేసుకుని చిరంజీవి వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ పుంజుకుంటుందని, ఈ ఎన్నికల్లో సమస్యలేర్పడినా..వచ్చే ఎన్నికల సమయానికి ఊపందుకుంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ పాలనకు ప్రజలు భయపడే రోజులు దగ్గరలోనే ఉందని, దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటుందని అంటున్నారు. -
నాడు జెయింట్ కిల్లర్.. నేడు?
అవి.. చిరంజీవి కొత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులు. చిరంజీవి సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కాగా, ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకొల్లు. చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకొల్లుతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. తాను పుట్టి పెరిగిన జిల్లా కావడం, అత్తవారి ఊళ్లో ముందునుంచి స్థానబలం ఉండటంతో పాలకొల్లులో సులభంగా గెలవగలనని భావించారు. ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణిని అభ్యర్థినిగా రంగంలో నిలిచారు. ఆమె మీద అప్పట్లో అంతగా అంచనాలు కూడా లేవు. ఎన్నికలు జరిగాయి. చిరంజీవి రెండుచోట్లా బంపర్ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితం తలకిందులైంది. తన సొంత ఊరి లాంటి పాలకొల్లులో చిరంజీవి ఓ మహిళ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అది కూడా ఏదో అంతంత మాత్రం మెజారిటీ కాదు.. ఐదు వేలకు పైగా ఓట్ల తేడా! దాంతో ఒక్కసారిగా బంగారు ఉషారాణి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగిపోయింది. జెయింట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి రాసింది. ఆ ఎన్నికల్లో ఉషారాణికి 49,720 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన చిరంజీవి 44,274 ఓట్లు మాత్రమే పొందగలిగారు. అంటే, వీరిద్దరి ఓట్ల మధ్య తేడా 5,446 అన్నమాట. మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ)కి 29,371 ఓట్లు వచ్చాయి. తర్వాత క్రమంగా ఆమెకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. పెద్దగా జనంలో తిరగలేదు. తనకు కావల్సిన వాళ్లకు పదవులు ఇప్పించుకోడానికి మాత్రం ప్రయత్నించారన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తనకు సలహాదారుగా వ్యవహరించిన ఓ మాజీ పాత్రికేయుడికి నామినేటెడ్ పదవి ఇప్పించుకోవడంలో ఆమె సఫలీకృతులయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకవేళ ఉషారాణికి టికెట్ రాకపోతే తాను పోటీ చేస్తానంటూ అదే వ్యక్తి ఉత్సాహం చూపుతున్నారని వినికిడి. ఉషారాణి మాత్రం పోటీ చేసినా ఈసారి ఎన్నోస్థానంలో ఉంటారనేది అనుమానమేనని స్థానికులు అంటున్నారు. డిపాజిట్ దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. జెయింట్ కిల్లర్ కాస్తా.. ఈసారి నామమాత్రంగా మిగిలిపోతారని వినిపిస్తోంది. -
'అన్నయ్య చిరంజీవితోనే ఉంటా'
-
అన్నయ్య చిరంజీవితోనే ఉంటా: నాగబాబు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి సోదరుడు నాగబాబు స్పందించారు. పవన్ కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విలేకరలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నా మద్దతు, అభిమానుల మద్దతు అన్నయ్యకే.... మా అందరికీ సమాజంలో గుర్తింపు అన్నయ్య వల్లే వచ్చిందని' అన్నారు. చివర వరకూ తాను అన్నయ్యతోనే ఉంటానని, అందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. చిరంజీవి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తమకు ఓ గొప్ప రాజమార్గాన్ని తయారు చేశారన్నారు. తమ్ముళ్లుగా తమకే కాకుండా అభిమానులందరికీ గొప్ప గుర్తింపు తెచ్చారన్నారు. ఈ మేరకు నాగబాబు ఓ ప్రకటన చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు తనయుడు వరుణ్ తేజ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్‌కు సోమవారమే దరఖాస్తు చేశారు. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
జనసేన పేరుతో పవన్ కొత్త పార్టీ?
ఎట్టకేలకు విషయం తేలిపోయింది. టాలీవుడ్ హీరో, కేంద్ర మంత్రి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు!! 'జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఎన్నికల కమిషన్‌కు సోమవారమే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారన్న విషయం ఎప్పటినుంచో వినవస్తున్నా.. ఇంతవరకు ఆయన స్పందించలేదు. త్వరలో విలేకరుల సమావేశం పెడతారంటూ ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు తేదీలు బయటకు వచ్చినా, అలా జరగలేదు. అందరూ ఎందుకంత ఖంగారు పడతారని, త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అన్ని విషయాలు ఆయనే వెల్లడిస్తారని ఆయన సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ఇంతకుముందు చెప్పారు. ఎట్టకేలకు శుక్రవారం నాడు పూర్తి స్థాయిలో పవన్ పార్టీ విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.