అన్నయ్య చిరంజీవితోనే ఉంటా: నాగబాబు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి సోదరుడు నాగబాబు స్పందించారు. పవన్ కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విలేకరలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నా మద్దతు, అభిమానుల మద్దతు అన్నయ్యకే.... మా అందరికీ సమాజంలో గుర్తింపు అన్నయ్య వల్లే వచ్చిందని' అన్నారు.
చివర వరకూ తాను అన్నయ్యతోనే ఉంటానని, అందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. చిరంజీవి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తమకు ఓ గొప్ప రాజమార్గాన్ని తయారు చేశారన్నారు. తమ్ముళ్లుగా తమకే కాకుండా అభిమానులందరికీ గొప్ప గుర్తింపు తెచ్చారన్నారు. ఈ మేరకు నాగబాబు ఓ ప్రకటన చేశారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు తనయుడు వరుణ్ తేజ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది.
జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కు సోమవారమే దరఖాస్తు చేశారు. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.