దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది.
ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా’ సోషల్‌మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు.
ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH
— Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023
Comments
Please login to add a commentAdd a comment