harati
-
కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు హారతులతో కూడా మార్పులు చేసింది.జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్(Kashi Vishwanath Dham)లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి, శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.మహాకుంభమేళా.. మహాశివరాత్రి(Mahashivratri)(ఫిబ్రవరి 26)తో ముగియనుంది. ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి 11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది. మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.ఇది కూడా చదవండి: కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత? -
హారతి ఇచ్చుకో.. వెయ్యి పుచ్చుకో!
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల తాయిలాలకు తెరతీశారు. ఇందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. హారతి పట్టు, వెయ్యి కొట్టు అన్న చందంగా తొలిరోజు వీరి ప్రచారం సాగింది. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని 40, 41 డివిజన్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పర్యటనలో మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టారు. హారతి పళ్లానికి రూ.వెయ్యి, టెంకాయ కొట్టినందుకు రూ. వెయ్యి చొప్పున సుజనా చౌదరి, కేశినేని చిన్ని మహిళలకు తాయిలాలు అందజేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా నిలబడడం అభ్యర్థులకు హారతులు పట్టడం తంతుగా మారింది. హారతులు పట్టిస్తూ కొబ్బరి కాయలు కొట్టిస్తూ అభ్యర్థులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రచారం కాస్ట్లీగా మార్చేశారు. తొలిరోజే ఇలా ఉంటే ఎన్నికల వరకు ఇంకెంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారో.. ఇంకెన్ని వినూత్న మార్గాలు ఎంచుకుని డబ్బులు పంచుతారో అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒక సామాన్యుడిపై బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగిన సుజానా చౌదరి ప్రచారం ప్రారంభం రోజే డబ్బులు వెదజల్లడం చూసి ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధమేనని పలువురు చర్చించుకుంటున్నారు. హారతి పట్టించుకుంటూ పళ్లంలో రూ. వెయ్యి చొప్పున వేస్తూ సుజనా చౌదరి కోడ్ ఉల్లంఘించారు. అనర్హులుగా ప్రకటించాలి పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్కుమార్ ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని కోరారు. భవానిపురం ప్రాంతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు హారతుల పేరుతో డబ్బులు వేసి ఆశ చూపారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ సోషల్మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి! Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH — Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023 -
నేడు తుంగా హారతి
– ఏర్పాట్లలో శ్రీమఠం అధికారులు – నదీ తీరం, ప్రాంగణంలో దీపోత్సవం మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధిలో సోమవారం పవిత్ర తుంగా హారతి ఇవ్వనున్నారు. ఇందుకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో తుంగభద్ర నది తీరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు పుణ్యహారతి, కార్తీక దీపోత్సవం చేపడతారు. ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై గజరాజు స్వాగతిస్తుండగా మంగళవాయిద్యాలు, భజనలు, వేద పఠనంతో ఊరేగింపుగా నది చెంతకు తీసుకువస్తారు. అక్కడ పీఠాధిపతి తుంగా హారతి విశిష్టతను భక్తులకు ప్రవచిస్తారు. పవిత్ర నది జలంతో ఆజ్యం ఇచ్చి కుంకుమార్చన, నారీకేళ సమర్పణ, వాయినాలు వదిలి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అర్చకులు కార్తీక దీపాలతో వేదపఠనం సాగిస్తూ హారతులు పడతారు. భక్తులు వేలాదిగా నదీ తీరం, శ్రీమఠం ప్రధాన ద్వారం, ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
వారణాసిలో గంగమ్మకు హారతి
-
భక్తజన హారతి
మహిళల సామూహిక పూజలు మంథని/ కాళేశ్వరం: అంత్యపుష్కరాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంథని వద్ద గల గోదావరికి భక్తులు పోటెత్తారు. శ్రావణ సోమవారం కావడంతో భారీగా తరలివచ్చి పుష్కరస్నానం చేశారు. మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతోపాటు వస్త్రాలను చాటలో పెట్టి సమర్పించారు. లింగదానం చేసుకున్న మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిండప్రదానాలు, పితృతర్పణాలు జరిగాయి. నదీ తీరంలోని సంగమేశ్వరుడు, హనుమాన్, గౌతమేశ్వర స్వామితోపాటు అనుబంధ ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరంలో గోదావరి నదికి ఆలయ అధికారులు, అర్చకులు గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్ల ఆలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో గోదావరి న దికి వెళ్లి అక్కడ గోదావరిమాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచహారతులను ఇచ్చారు. సర్పంచ్ మెంగాని మాధవి, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, జెడ్పీటీసీ హసీన భాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్రావు, మాజీధర్మకర్త అశోక్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ప్రశాంత్శర్మ, రామన్నశర్మ, రామాచార్యులు పాల్గొన్నారు.