ఏడు నెలల గర్భంతో 5కే రన్
కరీంనగర్: గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు వ్యాయామం చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవనే విషయాన్ని ప్రచారం చేసేందుకు ఏడు నెలల గర్భిణి కామారపు లక్ష్మి(42) శ్రీకారం చూట్టారు. కరీంనగర్‌కు చెందిన 7 నెలల గర్భిణి లక్ష్మి జిల్లా కేంద్రంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం 5 కే రన్ నిర్వహించారు. స్థానిక ఉజ్వల పార్క్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్లు ఉత్సాహంగా పరుగు తీసిన ఆమె.. డ్యాం వద్ద గల 80 మెట్లను పాపను ఎత్తుకొని అలవోకగా ఎక్కింది. పరుగు పందెంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన భర్త రవీందర్ సహకారంతో రోజూ వ్యాయామం చేస్తున్నానని లక్ష్మి ఈ సందర్భంగా వివరించింది.