Dirty Picture
-
అమ్మాయిల వీక్నెస్.. నేనింతే: లక్ష్మితో కిరణ్ రాయల్!
తిరుపతి, సాక్షి: సంచలనంగా మారిన జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్లిప్ బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే.. ఎలాగైనా డబ్బులిచ్చేస్తానంటూ కిరణ్ బాధితురాలితో చెప్పిన మాటలు బయటకొచ్చాయి. అంతేకాదు..అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడిన మాటలు కూడా ఆడియో క్లిప్‌లో ఉన్నాయి. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆడియోలో ఏమని ఉందంటే.. ‘‘నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా... ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం ఫర్వాలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారెంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabutvam) రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా’’ అని కిరణ్ రాయల్(Kiran Royal) తన మాటల గారడీని లక్ష్మిపై ప్రయోగించాడు. నా కూతురి మీద ఒట్టు.... నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చు..’’ అంటూ బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆ ఆడియోలో వాయిస్ ఉంది. -
తారల విషాదగాథలే... తెరపై అద్భుత కావ్యాలా?
చిత్ర సీమలో వెలిగిన తారలెందరో. నేలకు రాలిన తారలు మరెందరో. కొందరి తారల గాథలు సినిమా కథలా విషాదంతో ముగిశాయి. జీవితంలో ఓడిపోయినా.. వారి జీవితాన్ని కథగా మలిస్తే... అవి వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. అవే డర్టీపిక్చర్, మహానటి. సిల్క్ స్మిత. అప్పట్లో ఓ క్రేజీ స్టార్. ఈమె చూపుల్లోనే ఏదో మత్తు ఉన్నట్లు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. కేవలం ఈమె నర్తించిన పాటల కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక గీతం తరువాత థియేటర్లో ఎవరూ ఉండేవారు కాదట. అంతలా ఆమె పాపులార్టీని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఈమె స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉండేది. తెరపై మాత్రమే అశ్లీల పాత్రలు చేసే ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో నిగూఢ దానధర్మాలు చేసేవారట. సిల్క్‌స్మిత ఎంతో మంచి వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటి సిల్క్‌స్మిత కథను ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక సినీ తారల జీవిత చరిత్రను తెరకెక్కించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా మహానటి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిని సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతటి నటికి నివాళిగా పేర్కొన్నారు సినీ అభిమానులు. సినీ జీవితాన్ని ప్రారంభించడం, అందులోని ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, చివరి దశ అన్నింటిని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. మహానటి సావిత్రిని గుర్తుంచుకున్నంత కాలం ఈ ‘మహానటి’ సినిమాను కూడా గుర్తుంచుకుంటారు. బాలీవుడ్‌కు పెద్దన్న సంజయ్ దత్. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో ఎఫైర్స్, దుర్భరమైన జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కించారు రాజ్ కుమార్ హిరాణీ. తన ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒకరకమైన సందేశాన్ని ఇచ్చే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ సిరీస్, పీకే, త్రీ ఇడియట్స్ ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు హిరాణీ. తాజాగా తన ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ ప్రస్థానాన్ని సంజు పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటనకు బీ టౌన్ మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్రైలర్లో సంజయ్‌ను మరిపించేలా యాక్ట్ చేసిన రణ్‌బీర్ కపూర్ పూర్తి నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక సంజయ్‌దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడ ఈ సినిమా ప్రస్థావించబోతోంది. సంజయ్‌కు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందన్న విషయం, డ్రగ్స్‌కు బానిసైన పరిస్థితుల గురించి, ముంబై పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు కావల్సినంత ట్విస్ట్‌లు, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సంజయ్ దత్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం ఆశ్చర్యకరం. పైన మాట్లాడుకున్న రెండు సినిమాలు వారి మరణానంతరం కథలను వెండితెరపై ఆవిష్కరించారు. కానీ జూన్ 29న రానున్న సంజు మాత్రం అందుకు విరుద్దంగా వస్తోంది. ఈ సినిమా సంజయ్ దత్‌కు ఎలాంటి ఇమేజ్ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి. -
త్వరలో సెట్స్ మీదకు షకీలా బయోపిక్
నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర బయోపిక్ వెండితెర సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తార తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా అంగీకరించింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 16 ఏళ్ల వయసులోనే సినీ రంగం ప్రవేశం చేసిన షకీలా ఒక దశలో స్టార్ హీరోలకు కూడా గట్టిపోటినిచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ స్టార్లు కూడా ఆమె సినిమాలో పోటి పడాలంటే వెనకడుగువేసేవారు. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
బయో పీక్స్
► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా? చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది. ► బయోపిక్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. బాక్సింగ్ రింగ్‌లో మేరీ కోమ్ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న హార్టులు కూడా స్వీట్ సిక్స్టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్ స్టోరీతో ‘డర్టీ పిక్చర్’ తీస్తే ఎగబడి చూశారు. గ్రౌండ్లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్లో ఆడటానికి ఏ రేంజ్లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్.ధోని’ హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్ స్టోరీస్ ఏంటంటే... ► ట్రిపుల్ ధమాకా కిలాడీ కుమార్... బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ విషయంలో అక్షయ్ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. సోషల్ మెసేజ్ ఉన్న ‘ప్యాడ్‌మేన్’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్కిన్’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్’. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్లాంటి మాస్ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్. ఈ ఒక్క బయోపిక్‌లోనే కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే... ► గోల్డెన్ జూబ్లీ ఇయర్లో గోల్డ్ లాస్ట్ ఇయర్ అక్షయ్‌కుమార్ గోల్డెన్ జూబ్లి ఇయర్లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అక్షయ్ ‘గోల్డ్’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్ పూర్తయింది. హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్ సింగ్ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్’ తీశారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► గుల్షన్ జీవిత కథలో... ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్ కుమార్ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్ మ్యూజిక్ లేబుల్ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్’ చిత్రంలో గుల్షన్ కుమార్ పాత్ర చేయబోతున్నారు అక్షయ్. 1997లో గుల్షన్ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్ఎల్బి 2’ తెరకెక్కించిన సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► క్వీన్ కంగనా ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► దత్‌గా కపూర్ హీరో సంజయ్ దత్ జీవితం కథతో రాజ్‌కుమార్ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ చేస్తున్నారు. యంగ్ ఏజ్, ఓల్డ్ సంజయ్గా కనిపించడం కోసం రణ బీర్ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సంజయ్ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ► హృతిక్.. ఫస్ట్ బయోపిక్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్ ‘సూపర్ 30’ అనే కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్ ఇది. విశాల్ బాల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ ‘సూపర్ 30’. నవంబర్‌లో రిలీజ్ కానుంది. ► అతని గోల్ గెలుపే ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్ అయ్యింది. సందీప్ సింగ్ తిరిగి హాకీ స్టిక్ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్ గెలుపువైపు. హాకీ స్టిక్ పట్టుకున్నారు.. గోల్ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్ కథనంపై రీల్ లైఫ్ స్టోరీ రూపొందుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ► గురి ఎలా కుదిరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్. గోల్డ్ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్ బింద్రా పాత్రను హర్షవర్థన్ కపూర్ పోషించనున్నారు. ► సెట్స్‌కు సై! దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె జీవితం సిల్వర్ స్క్రీన్కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ► ఆడ.. ఈడ..అదే జోరు! పది బయోపిక్స్ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్ నటిస్తారని టాక్. రచయిత షాహిర్ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్ నటిస్తారట. ఆల్రెడీ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్ స్టోరీస్ రీల్ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్) కూడా బయోపిక్స్ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్’ చేస్తుండటం విశేషం. ► నో ఫైట్! సందీప్సింగ్కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్ ఏంటి గురూ అంటే.. రియల్ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్ సింగ్ బయోపిక్)ను జూన్ 29న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్ బయోపిక్కు పరిశీలనో ఉన్న టైటిల్) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సో.. నో ఫైట్ అన్నమాట. -
డర్టీపిక్చర్కు సీక్వెల్ రెడీ
-
అన్నంత పనీ అయ్యింది!
‘డర్టీ పిక్చర్’తో కుర్రకారును హీటెక్కించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా చేసిన ఫొటోషూట్‌లో ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచడం పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రోజుల క్రితం విద్యాబాలన్ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘2015 క్యాలెండర్ కోసం నేను చేయబోయే ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ ఆధ్వర్యంలో ఫొటోషూట్ వార్తల్లో నిలవడం ఖాయం. మీరే చూడండి.. కావాలంటే నేను అన్నంత పనీ జరుగుతుంది’’ అన్నారు. అన్నట్టుగానే ఈ ఫొటోషూట్ సంచలనానికి దారితీసింది. ఎందుకంటే, ఒంటి మీద కేవలం వార్తాపత్రికతో పోజులిచ్చారీ బ్యూటీ. ఈ పోజులు చూసినవాళ్లు ‘విద్యా చాలా హాట్ గురూ...’ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు. -
అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్’ పాటకు డాన్స్ చేసేదాన్ని...
‘‘తను అమ్మాయా, అమ్మమ్మా! ఆ ఆరు గజాల చీరలేంటి? నుదుట అంత పెద్ద బొట్టేంటి’’ అంటూ హిందీ రంగంలో విద్యాబాలన్‌ని విమర్శించినవారి శాతం ఎక్కువే ఉంది. కెరీర్ ఆరంభించిన కొత్తలో ఈ మలయాళ బ్యూటీని బాలీవుడ్లో కొంతమంది చిన్నచూపు చూశారు. కానీ, తన కట్టూబొట్టూ మార్చలేదు విద్యా. కట్ చేస్తే.. ‘చీరల్లో విద్యా సూపర్’ అని అభినందించడం మొదలుపెట్టారు. నిండైన చీరకట్టులోనే కాదు.. ‘డర్టీ పిక్చర్’లో వీలైనంత గ్లామరస్‌గా కనిపించి, అందర్నీ స్వీట్ షాక్‌కి గురి చేశారు విద్యా. అందానికి, అభినయానికి చిరునామా అనే పేరు సంపాదించుకున్న విద్యాకి సినిమా రంగం పట్ల ఎప్పుడు ఆసక్తి కలిగింది? తన వైవాహిక జీవితం ఎలా ఉంది? తదితర విశేషాలు... నేను కథానాయిక కావాలనుకోవడానికి ప్రధాన కారణం మాధురీ దీక్షిత్. ఆమె నటించిన ‘తేజాబ్’ చూసి, మాధురీలా నేను కూడా హీరోయిన్ అయ్యి, మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశా. అప్పట్నుంచీ వీలైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించేదాన్ని. ‘తేజాబ్’లో ‘ఏక్ దో తీన్ చార్..’కి మాధురీ చేసినట్లుగా బ్రహ్మాండంగా డాన్స్ చేసేదాన్ని. అప్పట్లో మా అక్క ప్రియాబాలన్కి ఓ సిల్క్ స్కర్ట్ ఉండేది. మాధురీ కట్టుకున్నట్లుగా నేనా స్కర్ట్‌ని తలకు చుట్టుకుని, గది లోపలికెళ్లి గడియ పెట్టుకుని, అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్..’ పాటకు డాన్స్ చేసేదాన్ని. పెద్దయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావని ఎవరైనా అడిగితే.. ‘హీరోయిన్ అవుతా’ అని చెప్పేదాన్ని. మా అమ్మా, నాన్న కూడా నా ఇష్టాన్ని కాదనలేదు. దాంతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి సన్నాహాలు మొదలుపెట్టాను. ఓసారి మా అక్క ‘హీరోయిన్ కావాలంటే అందంగా ఉంటే సరిపోదు.. బాగా యాక్ట్ చేయాలి’ అని చెప్పింది. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని బలంగా నిర్ణయించుకున్నా. అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలనుకున్న తర్వాత నేను, అక్క ఓ లోకల్ ఫొటోస్టూడియోకెళ్లి, ఫొటో తీయించాలనుకున్నాం. అప్పుడు అక్కే నాకు మంచి డ్రెస్ కొనిపెట్టింది. తనే మేకప్ చేసింది. కేశాలంకరణ కూడా తనే. సరే.. ఎట్టకేలకు ఫొటోలు దిగాను. నా బయోడేటా అక్కే రాసింది. ఆ ఫొటోలు, బయోడేటాని ఏక్తా కపూర్ ఆఫీస్‌కి పంపిస్తే, ఆడిషన్స్‌కి రమ్మన్నారు. నాతో పాటు 899 మంది ఆ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఫైనల్‌గా 30 మందిని ఎంపిక చేశారు. చివరికి నాకు అవకాశం వచ్చింది. అదే ‘హమ్ పాంచ్’ సీరియల్. మొదటి ఎపిసోడ్ చూడ్డానికి ఇంటిల్లిపాదీ టీవీ ముందు సెటిలైన వైనం నాకింకా గుర్తుంది. ఆ క్షణంలో నా గురించి నేను ఏమనుకున్నానో తెలుసా.. ‘ఈ ప్రపంచంలో మనకన్నా గొప్ప నటి లేరు’ అని. అప్పట్లో కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా తెలియదు. కానీ, నేను బెస్ట్ అనుకున్నా. అది తల్చుకుని ఇప్పటికీ నవ్వుకుంటుంటాను. ‘పరిణీత’ చిత్రం నా జీవితానికి కీలక మలుపైన విషయం తెలిసిందే. ‘లగే రహో మున్నాభాయ్’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. దాంతో పాటు నా వస్త్రధారణ గురించి కూడా కొంతమంది హేళనగా మాట్లాడేవారు. నేనేం పట్టించుకోలేదు. నా మనసు ఏది చెబితే దాన్నే ఫాలో అవుతా. ‘ఈ విమర్శలను పట్టించుకుంటే పెకైదగలేవు. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి’ అని నా మనసు చెప్పింది. దాన్నే అనుసరించా. ఇప్పుడు నా స్థాయి గురించి అందరికీ తెలిసిందే. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలంటే ‘విద్యాబాలన్ ఉంది’గా అంటారు. అభినయంతో పాటు గ్లామరస్‌గా కూడా కనిపించాలన్నా ‘విద్యా బ్రహ్మాండంగా చేస్తుంది’గా అంటున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్’లాంటివి చూసి, మనం సంబరపడిపోతుంటాం. మన సినిమాలేవైనా సాంకేతికంగా ఉన్నతంగా ఉంటే, హాలీవుడ్ సినిమాలా ఉందంటాం. హాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కల కొంతమందికి ఉంది. కానీ, నాకు మాత్రం మన భారతీయ సినిమాలే ఇష్టం. మనం ప్రతిభావంతులం అనిపించుకోవడానికి ‘అవతార్’లాంటి సినిమాలు తీయాల్సిన అవసరంలేదు. మన భారతీయులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అవి తీస్తే చాలు. నా వృత్తి జీవితం చాలా బాగుంది. వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంది. నా జీవితంలో ఉన్న పసందైన మలుపుల్లో ‘పెళ్లి’ అనే మలుపు చాలా కీలకమైనది. సిద్ధార్ధ్‌రాయ్ కపూర్ నా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టం. ఇలా చెబుతుంటే, దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉంది (నవ్వుతూ). ముంబయ్‌లో నా పుట్టింటి నుంచి అత్తింటికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు. కాబట్టి, మా అమ్మానాన్నలను మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఇప్పటికీ మా పుట్టింట్లోనే జిమ్ చేస్తున్నాను. ఇక, మెట్టినిల్లు అయితే నాకు పుట్టినిల్లులానే ఉంది. వంటగదిలో దూరిపోయి గంటలు గంటలు వంట చేసే తీరిక నాకు లేదు. ఖాళీ దొరికినప్పుడు సిద్ధార్ధ్‌కి నచ్చేవి చేసి పెడతా. లేనప్పుడు ఏమేం వండాలో వంటవాళ్లకి చెప్పేస్తా. ఏ వైవాహిక జీవితం అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే.. భర్త కోసం భార్య మారనప్పుడు... భార్య కోసం భర్త మారనప్పుడు. విచిత్రంగా అనిపిస్తోందా? పెళ్లయిన కొత్తలో ఒకరకమైన మత్తులో ఉంటాం. ఆ మత్తులో మనకు నచ్చకపోయినా జీవిత భాగస్వామికి నచ్చే పనులే చేస్తుంటాం. కొన్నాళ్లకు మనం ఏదో త్యాగం చేసినట్లుగా భావిస్తాం. ఏదైనా చిన్నపాటి గొడవ వచ్చిందనుకోండి ‘నీ కోసం అది త్యాగం చేశా. ఇది త్యాగం చేశా. నా జీవితంలో చాలా కోల్పోయా’ అంటూ అసలు విషయాన్ని కక్కేస్తాం. అక్కణ్ణుంచి భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే, అంటున్నా. పెళ్లికి ముందు మన పద్ధతులు ఎలా ఉన్నాయో.. పెళ్లి తర్వాత కూడా అలానే ఉండాలి. మార్చుకోదగ్గ విషయాల్లో మాత్రమే మారాలి. భార్యాభర్తలకు ఒకరంటే మరొకరికి ప్రేమ మాత్రమే కాదు గౌరవం కూడా ఉండాలి. -
టీవీక్షణం: కలలను నెరవేర్చే కార్యక్రమం!
డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ డైలాగ్ గుర్తుందా? ‘సినిమాలు కేవలం మూడే మూడింటి కారణంగా ఆడతాయి... ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్’. మన టీవీవాళ్లు ఎంటర్టైన్మెంట్ కోసమే రకరకాల ప్రోగ్రామ్స్ రూపొందిస్తుం టారు. కానీ ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం సబబేనా? ఏదైనా మంచిని చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? సినిమాలన్నీ ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినా, ఎంత వినోదాన్నే ప్రధానంగా చేసుకున్నా... సామాజికాంశాలను చర్చిస్తూ, సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపించే విధంగా కూడా అప్పుడప్పుడూ తెరకెక్కుతుంటాయి. వినోదమే ముఖ్యం కాదు, సందేశం కూడా అవసరమే అన్న విషయాన్ని గుర్తు చేస్తుంటాయి. మరి టీవీ కార్యక్రమాల మాటేమిటి? ఎంతసేపూ రియాలిటీ షోలు, సీరియళ్లు అంటూ సందడి చేయడమేనా లేక ఏదైనా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందా? జరుగుతోంది. కచ్చితంగా జరుగుతోంది. దానికి ‘మిషన్ సప్నే’ కార్యక్రమమే మంచి ఉదాహరణ! మన దేశంలో ఎంతోమంది ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. వారిలో చాలామందికి అనారోగ్యం ఏర్పడితే చికిత్స చేయించుకునే స్తోమత కూడా లేదు. అలాంటివారికి సహాయం చేసే ఉద్దేశంతో కలర్స్‌టీవీ రూపొందించిన కార్యక్రమమే ‘మిషన్ సప్నే’. చానల్స్‌వారు ఎంతసేపూ సెలెబ్రిటీలను పిలిచి ఇంటర్వ్యూలు చేయడం, జడ్జిలుగా వ్యవహరించమనడం చేస్తుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వారితో సేవ చేయిస్తున్నారు. ఫండ్స్ రెయిజ్ చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్ నడిరోడ్డు మీద హెయిర్ కట్ చేస్తే...! వరుణ్ ధావన్ కూరగాయలు అమ్మితే...! టెలివిజన్ బ్యూటీ క్వీన్ ద్రష్టి ధామి బుట్టలో పళ్లు పెట్టుకుని అమ్ముతుంటే...! కరణ్ జోహార్ గైడ్‌గా మారితే...! ప్రముఖ నటుడు రామ్‌కపూర్ ట్యాక్సీ నడిపితే...! రణబీర్ కపూర్ పావ్ భాజీ అమ్మితే..! వాళ్లకివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అనేగా? వాళ్లకి అవసరం లేదు. కానీ చేస్తున్నారు. ‘మిషన్ సప్నే’ టీమ్ వాళ్లతో అవన్నీ చేయిస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై నడిపిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రజల సహకారంతో పాటు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రముఖ సెలెబ్రిటీల అండ కూడా ఉండటంతో ప్రోగ్రామ్ విజయవంతంగా నడుస్తోంది. టీవీ ప్రోగ్రాములు వినోదాన్ని పంచడానికే కాదు, సమాజానికి మంచి చేయడానిక్కూడా అని నిరూపించిన ‘మిషన్ సప్నే’ టీమ్‌ని అభినందించి తీరాల్సిందే! -
అజారుద్దీన్ పాత్రలో హష్మి
బాలీవుడ్లో డర్టీ పిక్చర్, పాన్ సింగ్ తోమార్, భాగ్ మిల్కా భాగ్ చిత్రాల తర్వాత జీవిత కథల నేపథ్యం ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకుంది. తాజాగా బాక్సర్ మేరి కోమ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఓ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. అదే ఊపులో క్రికెటర్ అజారుద్దీన్ బయోపిక్‌గా ఓ చిత్రంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అజార్ పాత్రకోసం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మిల పేర్లను పరిశీలించారు. అయితే చిట్టచివరకు ఆ అవకాశం ‘సీరియల్ కిస్సర్’ హష్మీని వరించింది. స్వతహాగా క్రీడలంటే ఇష్టపడే హష్మీ... తనకు అజారుద్దీన్ పాత్ర దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రీడాకారుడిగానే కాకుండా ఎంపీగా సేవలందిస్తున్న అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, భార్యతో విడాకులు, ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోవడం లాంటి అనేక ఆసక్తికర అంశాలు ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రానికి నిర్మాత అని సమాచారం. -
16 భాషల్లో సిల్క్‌స్మిత జీవితకథ
నటి సిల్క్‌స్మిత జీవిత చరిత్ర చాలా ప్రాచుర్యం పొందింది. శృంగారతారగా ఆమె దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో రాణించారు. అయితే అర్ధాంతరంగా కన్నుమూశారు. సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో బాలీవుడ్లో ది దర్టీ పిక్చర్ పేరుతో రూపొందిన చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె పాత్రను పోషించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. సిల్క్ జీవిత కథతో ఇటీవల మలయాళంలో క్లైమాక్స్ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. స్మిత పాత్రను సానాఖాన్ పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఒరునడిగైయిన్ డైరీ పేరుతో అనువాదం అయింది. తాజాగా కన్నడంలో సిల్క్ జీవిత కథతో సిల్క్ సక్కత్ మగ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పాకిస్తాన్ నటి వీణామాలిక్ నటిస్తోంది. త్రిసూల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 16 భాషలలో అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారని త్రిసూల్ తెలిపారు.