షకీలా
నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర బయోపిక్ వెండితెర సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తార తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా అంగీకరించింది.
ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో షకీలా వ‍్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 16 ఏళ్ల వయసులోనే సినీ రంగం ప్రవేశం చేసిన షకీలా ఒక దశలో స్టార్ హీరోలకు కూడా గట్టిపోటినిచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌లు కూడా ఆమె సినిమాలో పోటి పడాలంటే వెనకడుగువేసేవారు. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment