
లాటన్ డిప్యూటీ మేయర్‌గా భారతీయ జర్నలిస్టు
లండన్: విదేశాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. అమెరికాలో కీలక పదవుల్లో భారతీయులు నియమితులవుతుండగా అటు యూకేలోనూ కీలక పదవులను దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ భారతీయ జర్నలిస్టు లాటన్ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. అదీ ఏకగ్రీవంగా. వివరాల్లోకెళ్తే.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన భారతీయుడు ఫిలిప్ అబ్రహాం ఇప్పటికే లాటన్ నగరంలో కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో ప్రత్యర్థులెవరూ పోటీకి నిలబడలేదు. దీంతో ఫిలిప్ డిప్యూటీ మేయర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నూతన మేయర్ కారల్ డేవిస్ ప్రకటించారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనవారు వచ్చే ఏడాదికి మేయర్ పదోన్నతి పొందడం ఇక్కడి విధానం. అబ్రహం కేరళకు చెందిన జర్నలిస్టు. 2012లో జరిగిన లాటన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు.