భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక (బీఎన్‌ఎంసీ) మేయర్ , డిప్యూటి మేయర్ పదవుల కోసం గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్ బరిలో ఇద్దరు అభ్యర్థులు, డిప్యూటి మేయర్ బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం బీఎన్‌ఎంసీలో కోనార్క్ వికాస్ అగాడి అధికారంలో ఉంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దరిమిలా శివసేన కార్పొరేటర్ తుషార్ చౌదరి మేయర్ పదవి కోసం పోటీపడుతున్నారు. అధికార పక్షంలో నుంచి కోనార్క్ వికాస్ అగాడి ఘట్‌నేత విలాస్ పాటిల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇదిలా ఉండగా, డిప్యూటీ మేయర్ పదవి కోసం సమాజ్ వాది పార్టీ తరఫున దిల్‌షత్ ఖాన్, కాంగ్రెస్ నుంచి ఖాన్ ముక్తార్ మహ్మద్ అలీ, సిద్ధికి అహ్మద్‌హుస్సేన్, అన్సారీ మహ్మద్ హలీమ్, ఖాన్ దిన్ మహ్మద్ షా, మహ్మద్ ఫరేజ్, అన్సారీ సాజిమ్ హుస్సేన్, ఇమ్రాన్ మహ్మద్ ఖాన్ బరిలో ఉన్నారు. కాగా, భివండీ కార్పొరేషన్‌లో 90 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
అధికార పక్షంలో వికాస్ ఆగాడి-10, బీజేపీ-10, రాష్ట్రవాది కాంగ్రెస్-9, సమాజ్‌వాది-16 పార్టీల (మొత్తం 45 మంది) కార్పోరేటర్లు ఉండగా, ప్రతిపక్షంలోని శివసేనకు 18, కాంగ్రెస్‌కు 27 మంది (మొత్తం 45 మంది) కార్పొరేటర్లు ఉన్నారు. గత మేయర్ ఎన్నికల సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు గైరాజర్ కావడంతో వికాస్ ఆగాడికి చెందిన ప్రతిభా పాటిల్ విజయం సాధించింది. ప్రస్తుతం గురువారం జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాది పార్టీల్లో చీలకలు ఏర్పడే సూచనలు కనబడుతుండటంతో ఎవరు గెలుపొందుతారో వేచిచూడాల్సిందే.
నేడు భివండీ మేయర్ ఎన్నిక
Published Wed, Dec 10 2014 10:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement