హైదరాబాద్ : వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్‌గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు.
వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
Published Tue, Mar 15 2016 1:44 PM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
Advertisement
Advertisement