'మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా' | fasiuddin deputy mayor announces Rs 25 lakh ex-gratia to family | Sakshi
Sakshi News home page

'మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా'

Aug 14 2016 1:49 PM | Updated on Sep 4 2017 9:17 AM

మ్యాన్హోల్లో పడి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై నగర డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ స్పందించారు.

హైదరాబాద్ :  హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలోని మ్యాన్హోల్లో పడి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై నగర డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ఆదివారం స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే వారి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలోని మాణికేశ్వర్ నగర్లో రహదారిపై మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పై విధంగా స్పందించారు.

 హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో మ్యాన్హోల్లో పడి శనివారం నలుగురు కార్మికులు మృతి చెందారు. మెట్రో వాటర్ వర్స్క్ పనుల్లో భాగంగా మ్యాన్హోల్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కార్మికులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. అప్పటికే  కార్మికులు మృతి చెందారు. మ్యాన్హోల్లో చిక్కుకున్న వారిని కాపాడబోయి గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులను ఓయూ మాణికేశ్వర్ నగర్కు చెందిన సత్యనారాయణ, నగేష్, చందు జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement