కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) లోని ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకాలకు దరఖాస్తులను .....
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) లోని ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రస్తుత సీఐసీ విజయ్‌శర్మ పదవీకాలం డిసెంబర్‌లో పూర్తి కానుంది. మొత్తం పదిమంది సమాచార కమిషనర్ల పోస్టులకుగాను ప్రస్తుతం 3 ఖాళీగా ఉన్నాయి. సీఐసీ, ఇతర సమాచార కమిషనర్లను నియమించాలని ప్రతిపాదించినట్టు సిబ్బంది, శిక్షణ విభాగం ఉత్తర్వుల్లో తెలిపింది.
సీఐసీ, ఇతర ఐసీ పదవుల్లో నియమితులయ్యేవారు ప్రజా జీవితంలో పేరుప్రతిష్టలు పొంది ఉండడమేగాక అన్ని అంశాలపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. న్యాయ, శాస్త్ర, సామాజిక సేవ, నిర్వహణ, జర్నలిజం, మాస్-మీడియా, గవర్నెన్స్ వంటి విషయాల్లో అనుభవం కలిగినవారై ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తులను పంపేందుకు అక్టోబర్ 12 చివరితేదీ.