vijay sharma
-
మావోయిస్టుల శాంతి చర్చల లేఖపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ స్పందన
-
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు. -
సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం
న్యూఢిల్లీ: మాజీ రక్షణ శాఖ కమిషనర్ ఆర్కే మాథుర్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా నియమితులయ్యారు. ప్రస్తుతం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ శర్మ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మాథుర్‌ను కేంద్రం నియమించింది. మాథూర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. త్రిపుర కేడర్‌కు చెందిన 62 ఏళ్ల మాథూర్ 2013 మే 28 నుంచి రెండేళ్ల పాటు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. -
సీఐసీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) లోని ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రస్తుత సీఐసీ విజయ్‌శర్మ పదవీకాలం డిసెంబర్లో పూర్తి కానుంది. మొత్తం పదిమంది సమాచార కమిషనర్ల పోస్టులకుగాను ప్రస్తుతం 3 ఖాళీగా ఉన్నాయి. సీఐసీ, ఇతర సమాచార కమిషనర్లను నియమించాలని ప్రతిపాదించినట్టు సిబ్బంది, శిక్షణ విభాగం ఉత్తర్వుల్లో తెలిపింది. సీఐసీ, ఇతర ఐసీ పదవుల్లో నియమితులయ్యేవారు ప్రజా జీవితంలో పేరుప్రతిష్టలు పొంది ఉండడమేగాక అన్ని అంశాలపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. న్యాయ, శాస్త్ర, సామాజిక సేవ, నిర్వహణ, జర్నలిజం, మాస్-మీడియా, గవర్నెన్స్ వంటి విషయాల్లో అనుభవం కలిగినవారై ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తులను పంపేందుకు అక్టోబర్ 12 చివరితేదీ. -
యజమాని హంతకుడిని పట్టించిన చిలుక
ఆగ్రా: తన యజమాని భార్యను హత్యచేసిన దుండగుడిని ఒక పెంపుడు చిలుక పట్టించింది. తన యజమానులు నేర్పిన మాటలతోనే.. హంతకుడెవరో చెప్పేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక హిందీ వార్తాపత్రిక ఎడిటర్ విజయ్ శర్మ భార్య నీలంను ఫిబ్రవరి 20న ఎవరో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కూడా. అయితే విజయ్ అల్లుడు అశుతోష్ గోస్వామి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా.. విజయ్ పెంచుకుంటున్న చిలుక భయంగా అరుస్తూ, విచిత్రంగా ప్రవర్తించసాగింది. విజయ్ ఆ చిలుకకు అంతకుముందే మాటలు నేర్పి ఉండడంతో... అనుమానితుల పేర్లను దాని ముందు పలకడం ప్రారంభించారు. అందులో అశుతోష్ పేరును పలికినప్పుడు ఆ చిలుక... ‘ఉస్నే మారా.. ఉస్నే మారా (అతనే చంపాడు.. అతనే చంపాడు)’ అని అరవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు అశుతోష్‌ను అదుపులోకి తీసుకుని.. తమదైన పద్ధతిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. రోన్నీ మాసే అనే వ్యక్తితో కలిసి అశుతోష్.. విజయ్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. డబ్బు, విలువైన వస్తువులు ఇవ్వాలని నీలంను బెదిరించారు. ఒకవేళ తమ పేర్లు బయటికి చెబుతుందేమోనని కత్తితో పొడిచి చంపేశారు. నీలం పెంపుడు కుక్క అరవడంతో దానినీ చంపేశారు. ఈ దృశ్యాన్ని చూసిన చిలుక... బయటపెట్టడంతో దొరికిపోయారు.