సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డా. ఐవీ రావు పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ వీసీగా మూడేళ్ల కాలపరిమితి ఈనెల 19తో ముగుస్తుంది. దీంతో ఆయన్నే వీసీగా మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఇటీవలే వీసీ నియామకం కోసం ముగ్గురు సభ్యుల తో ప్రభుత్వం సెర్చ్ కమిటీని కూడా వేసింది. కాగా కొన్ని నెలల క్రితం వయోపరిమితి సడలించి తనకే మళ్లీ వీసీ పదవి ఇవ్వాలని డా. ఐవీ రావు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది.