Naseem Zaidi
-
బాధ్యతలు స్వీకరించిన అచల్ కుమార్ జోతి
న్యూఢిల్లీ: 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణ లోకి తీసుకొంటారు. జనవరి 23,1953లో జన్మించిన అచల్ కుమార్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గుజరాత్ కేడర్‌కు చెందిన వారు. నదీం జైదీ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలి సిందే. -
గుజరాత్ సీఎస్‌గా చేసిన అచల్ జోతి
-
సీఈసీగా అచల్ జోతి
► మోదీ హయాంలో గుజరాత్ సీఎస్‌గా చేసిన అచల్ ► రేపు బాధ్యతల స్వీకరణ న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ వారసుడిగా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. జైదీ పదవీ కాలం బుధవారంతో ముగు స్తున్న నేపథ్యంలో అచల్‌ను నియమిస్తూ న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2013లో గుజరాత్ సీఎ స్‌గా రిటైర్ అయిన 64 ఏళ్ల అచల్ జోతి... 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గురువారం బాధ్యతలు చేపడతారు. 2015 మే 8న ముగ్గురు సభ్యు ల ఎన్నికల కమిషన్‌లో జోతి సభ్యుడిగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణ లోకి తీసుకొంటారు. అత్యున్నత హోదాల్లో సేవలు... గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గతంలో విభిన్న హోదాల్లో సేవలందించారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్‌గా, 1999– 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎన్ఎన్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. -
ముగిసిన ఈసీ సవాల్
ఈవీఎం ట్యాంపరింగ్‌కు ముందుకురాని ఎన్సీపీ, సీపీఎం సాక్షి, న్యూఢిల్లీ: తమ ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని నిరూపించాలని ఎన్నికల సంఘం(ఈసీ) విసిరిన సవాల్ శనివారం ఎలాంటి విశేషం లేకుండానే ముగిసింది. ట్యాంపర్ చేస్తామని ముందుకొచ్చిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఎంలు చివరి క్షణంలో సవాల్ నుంచి తప్పుకున్నాయి. దీంతో సవాల్ ముగిసిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని ఎన్నికలను ఓటు రసీదు(వీవీప్యాట్)తో కూడిన ఈవీఎంలతో జరపనున్నందున ట్యాంపరింగ్ వివాదం ఇక ముగిసిందన్నారు. ఓటరు తను ఎంచుకున్న అభ్యర్థికే తన ఓటు పడినట్లు తనిఖీ చేసుకునే వీవీప్యాట్‌తో మరింత పారదర్శకత వస్తుందన్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలట్తో ఓట్లు నిర్వహించే వీలులేదన్నారు. కోరిన సమాచారం ఇవ్వలేదు: ఎన్సీపీ శనివారం ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సవాల్ కార్యక్రమంలో ఎన్సీపీ, సీపీఎంల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈవీఎం పనితీరు అర్థం చేసుకుంటామని, సవాల్‌ను స్వీకరించబోమని సీపీఎం తెలిపింది. ట్యాంపర్ చేయాల్సిన ఈవీఎం మెమరీ, బ్యాటరీ నంబర్లను ముందస్తుగా తమకివ్వలేదంటూ రాజ్యసభ ఎంపీ వందనా చవాన్ సారథ్యంలోని ఎన్సీపీ బృందం సవాల్ నుంచి తప్పుకుంది. దీనికి ఈసీదే బాధ్యత అని ఆరోపించింది. ఈవీఎం పనితీరుపై తమ సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రదర్శనతో సీపీఎం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని జైదీ తెలిపారు. మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే తమ అనుమానాలకు ఆధారమని ఎన్సీపీ బృందం పేర్కొంది. సవాల్ ప్రక్రియను పరిశీలించడానికి తమను అనుమతించకపోవడం శోచనీయమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం అన్నారు. -
నేడు ఈవీఎంల హ్యాకింగ్ చాలెంజ్..
-
హ్యాకింగ్ చాలెంజ్.. జూన్ 3న!
దేశంలో గత కొన్నాళ్లుగా ఈవీఎంల కచ్చితత్వం విషయంలో జరుగుతున్న వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. తాము ఉపయోగిస్తున్న ఈవీఎంల మీద ఫిర్యాదు చేసినవాళ్లు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. తమ వద్ద ఉన్న ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించడానికి వాళ్ల ఐటీ నిపుణులతో కలిసి ఏ పార్టీ వాళ్లయినా జూన్ 3వ తేదీన రావాలని ఆయన సవాలు చేశారు. ఈవీఎంల హ్యాకింగ్ చాలెంజ్‌కి ఆ విధంగా ముహూర్తం పెట్టేశారు. ఏవైనా ఐదు నియోజకవర్గాల్లో ఉపయోగించిన వాటిలోంచి నాలుగు ఈవీఎంలను పార్టీలు ఎంచుకోవచ్చని, వాటిని హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేసి చూపించాలని నసీం జైదీ చెప్పారు. తాము వస్తున్న విషయాన్ని ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఖరారు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ప్రతి జాతీయ, ప్రాంతీయ పార్టీలు ముగ్గురిని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఎన్నికల సంఘానికి చాలా పార్టీలు ఈ విషయంలో ఫిర్యాదు చేశాయని, అయితే ఏ ఒక్కటీ కూడా ఆధారాలు మాత్రం చూపించలేదని తెలిపారు. ఈవీఎంలలో ఉండే చిప్‌ను ఒక్కసారే ప్రోగ్రాం చేయడానికి వీలుంటుందని, అందులో వై-ఫై చిప్ కూడా ఉండదని, అందువల్ల ట్రోజెన్ హార్స్‌ను చొప్పించడానికి వీలుండదని జైదీ అన్నారు. ఓటింగ్ యంత్రాల్లోకి వైరస్‌లను పంపడం కూడా అసాధ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్వహించే ఎన్నికలన్నింటినీ వీవీపాట్ మిషన్లతోనే నిర్వహిస్తామని, దానివల్ల మరింత పారదర్శకత ఉంటుందని ఆయన వివరించారు. -
ట్యాంపరింగ్ నిరూపించండి..!
-
ఈవీఎంల ట్యాంపరింగ్ నిరూపించండి!
-
ట్యాంపరింగ్ నిరూపించండి!
► ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సవాల్ ► తేదీని త్వరలో నిర్ణయిస్తామన్న ఈసీ న్యూఢిల్లీ: ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్ని ట్యాంపర్ చేసినట్లు నిరూపించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) సవాల్ విసిరింది. ఈవీఎంల్ని ట్యాంపర్ చేశారంటూ విపక్షాల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈవీఎంలపై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుందని, పేపర్ బ్యాలెట్లు వాడాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేయగా.. ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాలు తప్పకుండా జతచేయాలని మరికొన్ని స్పష్టం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ మాట్లాడుతూ.. ‘ఈవీఎంల ట్యాంపరింగ్ నిరూపించాలని సవాలు విసురుతున్నాం. ఇటీవలి ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్ని ట్యాంపర్ చేశారా? అన్న అంశంతో పాటు అత్యున్నత సాంకేతిక, నిర్వహణ ప్రమాణాలు పాటించినా సరే ఈవీఎంల్ని ట్యాంపర్ చేయవచ్చని నిరూపించేందుకు అవకాశం ఇస్తా’మని చెప్పారు. ఈవీఎంలకు సంబంధించి నెలకొన్న ఆందోళనలు, భయాల్ని త్వరలో తొలగిస్తామన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలకే ఈ సవాలు పరిమితం కాదని.. వేరే యంత్రాలూ అందుబాటులో ఉంటాయని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. సవాల్ తేదీని నిర్ణయించేందుకు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. మేం ఎవరికీ అనుకూలం కాదు: ఈసీ ఈసీ ఏ పార్టీకి అనుకూలం కాదని, అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తుందని జైదీ తేల్చిచెప్పారు. ‘ఈసీ ఎవరికీ అనుకూలం కాదన్న విషయాన్ని మీరు నమ్మాలి. ఇది రాజ్యాంగపరమైన, నైతిక విధి. మొత్తం 56 రాజకీయ పార్టీలు(7 జాతీయ పార్టీలు, 49 ప్రాంతీయ పార్టీలు) మాకు ఒక్కటే’ అని స్పష్టం చేశారు. ఈవీఎంలకు వీవీపీఏటీ(ఓటు ఎవరికి వేశామో చెప్పే స్లిప్) యంత్రాల అనుసంధానంతో ఈవీఎంలపై విశ్వసనీయత, పారదర్శకత ఏర్పడుతుంది. అలాగే అన్ని వివాదాలకు ముగింపు పలకవచ్చన్నారు. ఈవీఎంలకు పలు పార్టీల మద్దతు ఈవీఎంలకు బీజేపీ, సీపీఐ, సీపీఎం, అన్నాడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, జేడీయూలు పూర్తి మద్దతిస్తూ.. తప్పకుండా పేపర్ ట్రయల్ యంత్రాలు జతచేయాలని కోరాయి. బీఎస్పీ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు మాత్రం పేపర్ బ్యాలెట్ వ్యవస్థే ఉత్తమమని వాదించాయి. -
నగదు రహిత విరాళాలే పరిష్కారం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధనం వాడకాన్ని అడ్డుకునేందుకు పార్టీలకు నగదు రహిత విరాళాలే పరిష్కారమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ పేర్కొన్నారు. నగదురహిత విరాళాలు అత్యుత్తమమైనా అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేమని శుక్రవారం ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. మన సమాజం కూడా పార్టీలకు విరాళాలు నగదు రహితంగా ఉండాలనే కోరుకుంటుం దన్నారు. ఆ విధానంపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించలేద న్నారు. డిజిటల్ లావాదేవీల కోసం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పార్టీలకు ఒక వ్యక్తి ఇచ్చే విరాళాన్ని రూ. 2 వేలకు పరిమితం చేస్తూ తెచ్చిన సంస్కరణను పార్టీలు దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఓట్ల లెక్కింపులో మార్పులకు కేంద్రం తిరస్కారం
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు బయటకు కనిపించకుండా... తుది ఫలితాన్ని ఒకేసారి ’టోటలైజర్‘ యంత్రం ద్వారా వెల్లడించాలన్న ఈసీ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆ మేరకు నిర్ణయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీకి తెలిపింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఈవీఎంలకు టోటలైజర్ మిషన్ ను అనుసంధానం చేస్తారు. దీంతో తుది ఫలితం మాత్రమే వెల్లడవుతుంది. బూత్‌ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్న వివరాలు తెలియవు. -
ఒకేసారి ఎన్నికలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణకు రాజ్యాంగ సవరణతో పాటు అదనపు వనరులు అవసరమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ సంఘానికి వెల్లడించామని చెప్పారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన మొదటిసారి ఓటర్లు, 15–17 ఏళ్ల వయసు వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే సదస్సు ఉద్దేశమని చెప్పారు. -
ప్రభుత్వ నిధులు ఇప్పుడు కాదు
ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ జైదీ ♦ కఠిన చట్టాల ద్వారానే పారదర్శకత ♦ పార్టీల నిధుల సేకరణలోనే అసలు సమస్య న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికలకు ప్రభుత్వమే నిధులిచ్చేలా మార్పులు తీసుకు రావటానికి ఇది సరైన సమయం కాదని.. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ‘ఎన్నికల్లో డబ్బు ఖర్చు, ప్రజాప్రాతినిధ్యంపై దీని ప్రభావం’అంశంపై జరిగిన దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సదస్సులో జైదీ ప్రారంభోపన్యాసం చేశారు. ముందుగా నేరమయ రాజకీయ వ్యవస్థను లేకుండా చేయటం.. పార్టీలు, అభ్యర్థుల నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవటం, రాజకీయాల్లో అవినీతి, ఆ నిధుల తనిఖీ చేసేందుకు కఠినమైన చట్టాలు చేసి వేగవంతంగా అమలు చేసేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత విధానంలో మార్పు రానంతవరకు ప్రభుత్వ నిధులతో ఎన్నికలు నిర్వహిస్తే (ఎన్నికల ఖర్చుకోసం పార్టీలు, అభ్యర్థులకు ప్రభుత్వమే నిధులివ్వటం) అది పార్టీలకు.. తప్పు చేసేందుకు మరో అవకాశం ఇచ్చినట్లేనన్నారు. జైదీ ఇంకా ఏమన్నారంటే.. ► ప్రస్తుతం పార్టీల నిధుల సేకరణ విధానంతో నల్లధన నివారణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అక్రమంగా నిధులు ఎన్నికల ప్రక్రియలోకి వచ్చేస్తున్నాయి. మెజారిటీ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలివ్వటం లేదు. రాజకీయ నిధుల విషయంలో.. సరైన చట్టాలు లేకపోవటంతో భయంకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ► పెయిడ్ న్యూస్ రూపంలో ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నారు. చర్యలు తీసుకుందామన్నా.. చట్టంలో ఉన్న లొసుగులతో తప్పించుకుంటున్నారు. ► ఎన్నికల ట్రస్టుల ద్వారా పార్టీలకు నిధులు పెరుగుతున్నాయి. ఈ ట్రస్టులు.. ప్రభుత్వ సంస్థలనుంచి తప్ప.. ఏ ఇతర సంస్థ నుంచైనా లెక్కలేనన్ని నిధులు స్వీకరించవచ్చు. పార్టీలకు ఎన్ని నిధులైనా ఈయవచ్చు. ఈ ట్రస్టులకు వర్తించే నియమ నిబంధలను ప్రజాప్రాతినిధ్య చట్టం కిందికి రావు. విదేశాలనుంచీ నిధులు ఈ ట్రస్టులకు వస్తున్నాయి. ► వివరాలు అందించని అభ్యర్థులు, పార్టీలకు జరిమానా వేసి చేతులు దులుపుకోవటం తప్ప ఎన్నికల సంఘం ఏమీ చేయలేదు. ► ఎక్కువ డబ్బులు ఖర్చుచేస్తున్న పార్టీలకే ఎక్కువ విజయావకాశాలుండే పరిస్థితి. దీంతో.. ‘క్విడ్ ప్రో కో’ విధానంలో.. పార్టీలకు నిధులివ్వటం. వాళ్లు అధికారంలోకి వచ్చాక.. డబ్బులిచ్చిన వాళ్లు ప్రతిఫలాలు తీసుకోవటం వల్ల సమాజంలో సమస్యలు తలెత్తుతున్నాయి. -
పారదర్శక ఎన్నికలే ఈసీ ధ్యేయం: జైదీ
న్యూఢిల్లీ: ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే ఎన్నికల సంఘం ధ్యేయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా ద్వారా శాయశక్తులా కృషిచేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన బ్రహ్మ శనివారం రిటైరయ్యారు. జైదీ జులై 2017 వరకు సీఈసీగా ఉంటారు. 1976 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఈయన పౌర విమాన శాఖలో చాలా కాలం పనిచేశారు. కాగా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై నిర్ణయం కోసం న్యాయ శాఖ ప్రధానికి నివేదికలు అందజేసింది. -
సీఈసీగా నజీం జైదీ!
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ఎన్నికల కమిషనర్ నజీం జైదీని నియమించే అవకాశం ఉంది. సీఈసీ హెచ్ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నజీం జైదీ పేరును కేంద్ర న్యాయ శాఖ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధాని గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన లాంఛనాలను న్యాయశాఖ పూర్తి చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. గత జనవరిలో సంపత్ పదవీ విరమణ అనంతరం అప్పటి ముగ్గురు సభ్యులలో ఒకరైన బ్రహ్మ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సంపత్ పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని అప్పుడు భర్తీ చేయలేదు. ఇప్పుడు బ్రహ్మ స్థానంలో జైదీ సీఈసీగా నియమితులైన తరువాత రెండు కమిషనర్ల పోస్టులూ ఖాళీగా ఉంటాయి.