
పారదర్శక ఎన్నికలే ఈసీ ధ్యేయం: జైదీ
న్యూఢిల్లీ: ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే ఎన్నికల సంఘం ధ్యేయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా ద్వారా శాయశక్తులా కృషిచేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన బ్రహ్మ శనివారం రిటైరయ్యారు. జైదీ జులై 2017 వరకు సీఈసీగా ఉంటారు. 1976 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఈయన పౌర విమాన శాఖలో చాలా కాలం పనిచేశారు. కాగా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై నిర్ణయం కోసం న్యాయ శాఖ ప్రధానికి నివేదికలు అందజేసింది.